ద్వైపాక్షిక సంబంధాలపై మోదీ, మెక్రాన్‌ సమీక్ష

ద్వైపాక్షిక సంబంధాలు, రక్షణరంగంలో సహకారం వంటి అంశాలపై భారత ప్రధాని నరేంద్రమోదీ, ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్‌ మెక్రాన్‌ మంగళవారం ఫోన్‌ సంభాషణలో చర్చించుకున్నారు. పౌర అణు ఇంధన రంగంలో సహకారం

Published : 17 Aug 2022 05:59 IST

దిల్లీ: ద్వైపాక్షిక సంబంధాలు, రక్షణరంగంలో సహకారం వంటి అంశాలపై భారత ప్రధాని నరేంద్రమోదీ, ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్‌ మెక్రాన్‌ మంగళవారం ఫోన్‌ సంభాషణలో చర్చించుకున్నారు. పౌర అణు ఇంధన రంగంలో సహకారం, భౌగోళిక-రాజకీయపరమైన సవాళ్లు వంటివి వారిమధ్య సమీక్షకు వచ్చాయి. రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధ నేపథ్యంలో ఆహార భద్రతకు తలెత్తే ముప్పుపై రెండు దేశాలూ ఇదివరకే ఆందోళన వ్యక్తంచేశాయి. కార్చిచ్చు, కరవులను ఎదుర్కోవడంలో ఫ్రాన్స్‌కు సహకారాన్ని అందిస్తామని మోదీ హామీ ఇచ్చారు. ఇటీవలి ఏళ్లలో రెండు దేశాల మధ్య భాగస్వామ్యం బలపడుతుండడంపై నేతలు సంతృప్తి వ్యక్తంచేశారు. మరిన్ని రంగాలకు సహకారాన్ని విస్తరించుకోవాలని నిర్ణయించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని