భారీ యుద్ధ విన్యాసాలకు అమెరికా, దక్షిణ కొరియా సన్నద్ధం

అమెరికా, దక్షిణ కొరియాలు వచ్చే వారం భారీ సైనిక విన్యాసాలకు సిద్ధమవుతున్నాయి. ఆయుధ పరీక్షలు, అణ్వస్త్ర ప్రయోగ హెచ్చరికలతో ప్రత్యర్థి దేశం ఉత్తర కొరియా దురుసుగా వ్యవహరిస్తున్న నేపథ్యంలో వీటిని నిర్వహిస్తున్నాయి. ‘ఉల్చి ఫ్రీడమ్‌

Published : 17 Aug 2022 05:59 IST

 ఉత్తర కొరియా కట్టడే లక్ష్యం

సియోల్‌: అమెరికా, దక్షిణ కొరియాలు వచ్చే వారం భారీ సైనిక విన్యాసాలకు సిద్ధమవుతున్నాయి. ఆయుధ పరీక్షలు, అణ్వస్త్ర ప్రయోగ హెచ్చరికలతో ప్రత్యర్థి దేశం ఉత్తర కొరియా దురుసుగా వ్యవహరిస్తున్న నేపథ్యంలో వీటిని నిర్వహిస్తున్నాయి. ‘ఉల్చి ఫ్రీడమ్‌ షీల్డ్‌’ పేరిట దక్షిణ కొరియాలో ఈ నెల 22 నుంచి సెప్టెంబరు 1 వరకూ ఈ విన్యాసాలు జరుగుతాయి. ఇందులో యుద్ధవిమానాలు, యుద్ధనౌకలు, ట్యాంకులతో పాటు వేల మంది సైనికులు పాల్గొంటారు. కొన్నేళ్లుగా ఈ స్థాయి విన్యాసాలను అమెరికా, దక్షిణ కొరియాలు నిర్వహించడంలేదు. ఉత్తర కొరియాతో దౌత్యపరమైన వెసులుబాటు కలిగించడం, కొవిడ్‌ వ్యాప్తి వంటి అంశాల వల్ల ఇప్పటివరకూ పరిమిత స్థాయిలోనే యుద్ధ క్రీడలు చేపట్టేవి. కొన్నిసార్లు వీటిని కంప్యూటర్‌ సిమ్యులేషన్ల ద్వారా నిర్వహించేవి. క్షిపణి దాడులకు సంబంధించి ముందస్తు హెచ్చరికలపై ఇటీవల హవాయ్‌ తీరానికి చేరువలో విన్యాసాలు నిర్వహించాయి. ఇందులో జపాన్‌ నౌకాదళం కూడా పాల్గొంది. ఉత్తర కొరియా నుంచి పొంచి ఉన్న సవాళ్లను ఎదుర్కోవడమే దీని ఉద్దేశం. తాజాగా నిర్వహించే భారీ విన్యాసాలపై ఉత్తర కొరియా ఎలా స్పందిస్తుందన్నది ఆసక్తికరంగా మారింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని