క్యాన్సర్‌ వ్యాప్తిని పసిగట్టే చిప్‌

శరీరంలో ఒకచోట ప్రారంభమైన క్యాన్సర్‌... దాని కణాలు రక్తంలో కలవడం ద్వారా ఇతర భాగాలకూ వ్యాపిస్తుంది. సాధారణంగా వ్యాధి నాలుగో దశకు చేరినప్పుడు ఈ పరిస్థితి తలెత్తుతుంది. ‘మెటాస్టాటిక్‌ క్యాన్సర్‌’గా పిలిచే ఈ పరిణామాన్ని

Published : 18 Aug 2022 05:11 IST

అట్లాంటా: శరీరంలో ఒకచోట ప్రారంభమైన క్యాన్సర్‌... దాని కణాలు రక్తంలో కలవడం ద్వారా ఇతర భాగాలకూ వ్యాపిస్తుంది. సాధారణంగా వ్యాధి నాలుగో దశకు చేరినప్పుడు ఈ పరిస్థితి తలెత్తుతుంది. ‘మెటాస్టాటిక్‌ క్యాన్సర్‌’గా పిలిచే ఈ పరిణామాన్ని ముందుగా గుర్తించడం ఇప్పటివరకూ అసాధ్యంగానే మిగిలిపోయింది. అయితే, జార్జియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ శాస్త్రవేత్తలు దీన్ని ఛేదించే విధానాన్ని కనుగొన్నారు. క్యాన్సర్‌ కణితి వ్యాప్తి దశకు చేరినప్పుడు, దాని నుంచి రక్తంలోకి కణాలు విడుదలవుతాయి. ఈ కణాలు రక్తంలో విడివిడిగా ఉంటే మనుగడ సాగించలేవు. సమూహంగా ప్రవహిస్తే మాత్రం శరీరంలోని ఇతర భాగాలకూ వ్యాధి విస్తరిస్తుంది. ఇలాంటి కణాలు కంప్యూటెడ్‌ టోమోగ్రాఫిక్‌ కోలనోగ్రఫీ (సీటీసీ) పరీక్షలకు చిక్కడంలేదు. దీంతో పరిశోధకులు రక్తంలోని క్యాన్సర్‌ కణాల జాడను పసిగట్టే ‘క్లస్టర్‌-వెల్‌’ అనే సరికొత్త మైక్రో-ఫ్లూయిడ్‌ చిప్‌ను రూపొందించారు. ఇది రక్తాన్ని నిశితంగా విశ్లేషించి... లక్షల సంఖ్యలోని రకరకాల కణాల మధ్య నక్కిన క్యాన్సర్‌ సెల్స్‌ను పసిగడుతుంది. అవి ఏ స్థితిలో, ఏ దశలో ఉన్నాయన్నది కూడా వెల్లడిస్తుంది. తొలుత సిలికాన్‌తో తయారుచేసిన ఈ చిప్‌ను.. తక్కువ ధరకే అందరికీ అందుబాటులోకి తీసుకొచ్చేలా ఆ తర్వాత పాలిమర్లతో రూపొందించినట్టు ప్రొఫెసర్‌ ఫాతిగ్‌ సరియోగ్లు వివరించారు. క్యాన్సర్‌ చికిత్సల్లో ఈ పరిశోధన విప్లవాత్మక మార్పులు తీసుకురానుందని భావిస్తున్నారు.

Read latest World News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని