మానసిక స్థిరత్వంతోనే వాయిదా మనస్తత్వం వదిలేది

‘అబ్బా... ఇప్పుడు కాదులే, తర్వాత చేసుకోవచ్చులే’ అని పనులను తరచూ వాయిదా వేస్తున్నారా? జాగ్రత్త! ఈ వాయిదా మనస్తత్వానికి బద్ధకమో, సమయపాలన లేకపోవడమో కారణం కాదట.

Published : 18 Aug 2022 05:11 IST

డర్హమ్‌: ‘అబ్బా... ఇప్పుడు కాదులే, తర్వాత చేసుకోవచ్చులే’ అని పనులను తరచూ వాయిదా వేస్తున్నారా? జాగ్రత్త! ఈ వాయిదా మనస్తత్వానికి బద్ధకమో, సమయపాలన లేకపోవడమో కారణం కాదట. స్థిరమైన మానసిక స్థితి కొరవడటం వల్లే చాలామంది పనులను వాయిదా వేసుకుంటున్నట్టు యూకేలోని డర్హమ్‌ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు కనుగొన్నారు. పనులు ఒత్తిడిని కలిగించడం; నైపుణ్యాలు, సామర్థ్యాలు ఆశించిన స్థాయిలో లేవన్న భావనతోనే చాలామంది ఆత్మన్యూనతకు గురవుతున్నారు. ఇలాంటి వారు పనులను ప్రారంభించేందుకూ, పూర్తిచేసేందుకూ వెనుకాడతారని పరిశోధనకర్త ఫచియా సిరోయిస్‌ విశ్లేషించారు. ఈ మేరకు పలువురి మెదడు ఆకారాలు, పనితీరును తులనాత్మకంగా అధ్యయనం చేశారు. ‘‘పనులను చకచకా పూర్తిచేసే వ్యక్తులు, వాటిని వాయిదాలు వేసేవారి మెదళ్ల పనితీరు భిన్నంగా ఉంటోంది. ఇబ్బందికర పనులను తప్పించుకున్నప్పుడు ప్రతికూల భావోద్వేగాలు కూడా దూరమవుతాయి. దీంతో సమస్యలు ఎదురైనప్పుడల్లా... వాటిని తప్పించుకోవడానికి మనసు ప్రయత్నిస్తుంది. ఇలాంటి వారు చదువులు, ఉద్యోగాల్లో తీవ్రంగా నష్టపోతుంటారు. వాయిదా మనస్తత్వం కారణంగా దీర్ఘకాలంలో తీవ్రస్థాయి ఆందోళన, వ్యాకులత, శారీరక రుగ్మతలకు గురయ్యే ప్రమాదముంది’’ అని సిరోయిస్‌ విశ్లేషించారు.

Read latest World News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని