కాబుల్‌ మసీదులో భారీ పేలుడు

అఫ్గానిస్థాన్‌ రాజధాని కాబుల్‌లో బుధవారం తీవ్ర విధ్వంసం చోటుచేసుకుంది. స్థానిక ఖైర్‌ ఖానా ప్రాంతంలోని ఓ మసీదులో సాయంత్రం ప్రార్థనలు జరుగుతుండగా భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో మసీదు ఇమామ్‌ సహా కనీసం 20 మంది

Published : 18 Aug 2022 05:11 IST

20 మంది దుర్మరణం!

కాబుల్‌: అఫ్గానిస్థాన్‌ రాజధాని కాబుల్‌లో బుధవారం తీవ్ర విధ్వంసం చోటుచేసుకుంది. స్థానిక ఖైర్‌ ఖానా ప్రాంతంలోని ఓ మసీదులో సాయంత్రం ప్రార్థనలు జరుగుతుండగా భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో మసీదు ఇమామ్‌ సహా కనీసం 20 మంది దుర్మరణం పాలైనట్లు తెలుస్తోంది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశాలున్నాయని కొందరు అధికారులు తెలిపారు. పేలుడు తీవ్రతకు సమీపంలోని భవనాల కిటికీలు ధ్వంసమయ్యాయి. తాజా దారుణానికి పాల్పడింది ఎవరనేది ప్రస్తుతానికి తెలియరాలేదు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని