ఐరాస ఐజీఎఫ్‌ బృందంలో ఇద్దరు భారతీయులు

ఐక్యరాజ్య సమితి (ఐరాస) సరికొత్త ఇంటర్నెట్‌ పాలన వేదిక (ఐజీఎఫ్‌) నాయకత్వ బృందానికి సెక్రటరీ జనరల్‌ ఆంటోనియో గుటెరస్‌ 10 మంది సభ్యులను నియమించారు. వీరిలో భారత ఎలక్టాన్రిక్స్‌, ఐటీ శాఖ కార్యదర్శి అల్కేశ్‌ కుమార్‌ శర్మ కూడా

Published : 18 Aug 2022 05:47 IST

జెనీవా: ఐక్యరాజ్య సమితి (ఐరాస) సరికొత్త ఇంటర్నెట్‌ పాలన వేదిక (ఐజీఎఫ్‌) నాయకత్వ బృందానికి సెక్రటరీ జనరల్‌ ఆంటోనియో గుటెరస్‌ 10 మంది సభ్యులను నియమించారు. వీరిలో భారత ఎలక్టాన్రిక్స్‌, ఐటీ శాఖ కార్యదర్శి అల్కేశ్‌ కుమార్‌ శర్మ కూడా ఉన్నారు. వీరితోపాటు నియమితులైన అయిదుగురు ఎక్స్‌అఫీషియో సభ్యుల్లో ఐరాస సెక్రటరీ జనరల్‌కు టెక్నాలజీ ప్రతినిధి అయిన అమన్‌దీప్‌ సింగ్‌ గిల్‌ కూడా ఉన్నారు. ఈమేరకు ప్రపంచవ్యాప్తంగా ప్రముఖులను ఐజీఎఫ్‌ నాయకత్వ బృందంలో సభ్యులుగా నియమించారు. ఐజీఎఫ్‌ చర్చలను, సిఫార్సులను ప్రపంచ దేశాలకు అందజేసి కార్యోన్ముఖం చేయడం నాయకత్వ బృందం బాధ్యత.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు