జాబిల్లిని చేరేందుకు భారీ రాకెట్‌

జాబిల్లిపైకి యాత్రలు చేపట్టేందుకు ఆర్టెమిస్‌ మిషన్‌ను తలపెట్టిన అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ ‘నాసా’ తాజాగా కీలక ముందడుగు వేసింది. ఈ మిషన్‌ను సాకారం చేసుకునే ప్రయత్నాల్లో భాగంగా తయారుచేసిన భారీ రాకెట్‌-

Published : 19 Aug 2022 04:22 IST

 ఆర్టెమిస్‌ మిషన్‌ కోసం సిద్ధం చేసిన నాసా

వాషింగ్టన్‌: జాబిల్లిపైకి యాత్రలు చేపట్టేందుకు ఆర్టెమిస్‌ మిషన్‌ను తలపెట్టిన అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ ‘నాసా’ తాజాగా కీలక ముందడుగు వేసింది. ఈ మిషన్‌ను సాకారం చేసుకునే ప్రయత్నాల్లో భాగంగా తయారుచేసిన భారీ రాకెట్‌- ‘స్పేస్‌ లాంచ్‌ సిస్టమ్‌ (ఎస్‌ఎల్‌ఎస్‌)’ను ఫ్లోరిడాలోని కెన్నడీ అంతరిక్ష కేంద్రంలో 39బి ప్యాడ్‌కు చేర్చింది. ఈ నెల 29న దాన్ని తొలిసారి ప్రయోగించనున్నారు. భవిష్యత్తులో చందమామ ఉపరితలంపైకి వ్యోమగాములను పంపేందుకు ఈ రాకెట్‌ను వినియోగించనున్నారు. 29న మాత్రం మానవరహితంగానే ప్రయోగించనున్నారు. ఎస్‌ఎల్‌ఎస్‌ పొడవు 100 మీటర్లు. ఇందులో వ్యోమగాములను తీసుకెళ్లేందుకు పొందుపర్చిన ‘ఒరాయన్‌’ క్యాప్సుల్‌ 5 మీటర్ల వెడల్పు ఉంటుంది. 1960ల్లో, 70ల్లో చంద్రుడిపైకి మానవులను పంపేందుకు ఉపయోగించిన క్యాప్సుల్స్‌తో పోలిస్తే దీని వెడల్పు ఒక మీటరు ఎక్కువ. ఆర్టెమిస్‌తో జాబిల్లి యాత్రలను దిగ్విజయంగా పూర్తిచేసుకోగలిగితే.. 2030వ దశకంలో లేదా ఆ తర్వాత అంగారకుడిపైకి మానవసహిత యాత్రలను చేపట్టేందుకు అది గొప్ప ముందడుగుగా మారుతుందన్నది నాసా యోచన.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని