అమెరికాలో ఘనంగా స్వాతంత్య్ర దినోత్సవం

అమెరికాలోని శాన్‌ఫ్రాన్సిస్కోలో భారత కాన్సులేట్‌ ఆధ్వర్యంలో స్వాతంత్య్ర దినోత్సవాలు ఘనంగా జరిగాయి. చారిత్రక గాదర్‌ మెమోరియల్‌ వద్ద కాన్సుల్‌ జనరల్‌ డాక్టర్‌ టి.వి.నాగేంద్రప్రసాద్‌ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.

Published : 19 Aug 2022 04:22 IST

ఈనాడు, హైదరాబాద్‌: అమెరికాలోని శాన్‌ఫ్రాన్సిస్కోలో భారత కాన్సులేట్‌ ఆధ్వర్యంలో స్వాతంత్య్ర దినోత్సవాలు ఘనంగా జరిగాయి. చారిత్రక గాదర్‌ మెమోరియల్‌ వద్ద కాన్సుల్‌ జనరల్‌ డాక్టర్‌ టి.వి.నాగేంద్రప్రసాద్‌ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వేడుకల్లో పాల్గొన్న భారతీయులకు రాష్ట్రపతి సందేశాన్ని చదివి వినిపించారు. స్వాతంత్య్ర వేడుకలను పురస్కరించుకుని పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. భారతీయులు గోల్డెన్‌ గేట్‌ వరకు పొడవైన జాతీయ పతాకంతో తిరంగా యాత్ర చేపట్టారు. శాన్‌ఫ్రాన్సిస్కో నగరంలోని గవర్నర్‌ లండన్‌ బ్రీడ్‌ సిటీహాల్‌ను త్రివర్ణ రంగుల దీపాలతో అలంకరించారు. స్వాతంత్ర దినోత్సవాన్ని భారత-అమెరికా స్నేహ, చారిత్రక దినోత్సవంగా పలువురు అభివర్ణించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని