భారత్‌పై చైనా మరో ఎత్తుగడ

భారత్‌తో కయ్యానికి కాలు దువ్వుతున్న చైనా... తాజాగా మరో ఎత్తుగడ వేసింది. తన భూభాగం వెలుపల తొలి విదేశీ నౌకా స్థావరంలో సైనిక కార్యకలాపాలు ప్రారంభించినట్టు తెలుస్తోంది. హిందూ మహాసముద్రంలో పట్టు బిగించటమే

Published : 19 Aug 2022 05:22 IST

 విదేశీ నౌకా స్థావరంలో యుద్ధనౌక మోహరింపు

ఉపగ్రహ సమాచారాన్ని సేకరించే ముప్పు!

బీజింగ్‌: భారత్‌తో కయ్యానికి కాలు దువ్వుతున్న చైనా... తాజాగా మరో ఎత్తుగడ వేసింది. తన భూభాగం వెలుపల తొలి విదేశీ నౌకా స్థావరంలో సైనిక కార్యకలాపాలు ప్రారంభించినట్టు తెలుస్తోంది. హిందూ మహాసముద్రంలో పట్టు బిగించటమే లక్ష్యంగా ఈ కుయుక్తులు పన్నుతోంది. 2016లో చైనా 590 మిలియన్‌ డాలర్లు వెచ్చించి హార్న్‌ ఆఫ్‌ ఆఫ్రికాలో నౌకా స్థావరం నిర్మించింది. అంతర్జాతీయ వాణిజ్యంలో అత్యంత కీలకంగా భావించే సూయజ్‌ కాలువ మార్గంలో... ఎర్ర సముద్రం, గల్ఫ్‌ ఆఫ్‌ ఏడెన్‌ను వేరుచేసే వ్యూహాత్మక బాబ్‌-ఎల్‌-మాండెబ్‌ జలసంధి వద్ద ఈ స్థావరం ఉంది. ప్రత్యక్ష దాడిని తట్టుకునేలా దీన్ని నిర్మించినట్టు సమాచారం. అయితే డ్రాగన్‌ ఇప్పుడు అక్కడ యుజావో యుద్ధనౌకను మోహరించినట్టు స్పష్టమైంది. ఇందుకు సంబంధించిన ఉపగ్రహ ఛాయాచిత్రాలు మీడియాకు అందాయి. 25 వేల టన్నుల బరువు, 800 మంది సైనిక సామర్థ్యం గల ఈ నౌకపై వాహనాలతోపాటు జెట్‌ ఫైటర్లను మోహరించవచ్చు. ఇది ట్యాంకులు, ట్రక్కులు, హోవర్‌ క్రాఫ్ట్‌లను కూడా మోయగలదు. ఈ నౌక ద్వారా భారత్‌కు సంబంధించిన కీలక ఉపగ్రహ సమాచారాన్ని సేకరించే ప్రమాదముంది. సరిహద్దుల్లో నిఘా, ఉగ్రవాద చొరబాట్ల గుర్తింపు, ఉగ్రవాద వ్యతిరేక కార్యకలాపాలకు సంబంధించి భారత నిఘా వ్యవస్థలు చేపడుతున్న చర్యలను డ్రాగన్‌ పర్యవేక్షించే ముప్పు ఉన్నట్టు రక్షణరంగ నిపుణులు చెబుతున్నారు. చైనా ఇటీవలే శ్రీలంకలోని హంబన్‌టోటా ఓడరేవులో 25 వేల టన్నుల యువాన్‌ వాంగ్‌ యుద్ధనౌకను మోహరించిన సంగతి తెలిసిందే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని