పోటీలో గెలిస్తే.. భారత్‌లో బ్రిటన్‌ హైకమిషనర్‌ మీరే!

భారత్‌లో బ్రిటన్‌ హైకమిషనర్‌గా ఒకరోజుపాటు విధులు నిర్వర్తించాలనుకుంటున్నారా? మీరు 18-23 ఏళ్ల మధ్య వయసున్న యువతులైతే ఈ బృహత్తర అవకాశం మీ కోసమే! మీరు

Updated : 19 Aug 2022 06:16 IST

దిల్లీ: భారత్‌లో బ్రిటన్‌ హైకమిషనర్‌గా ఒకరోజుపాటు విధులు నిర్వర్తించాలనుకుంటున్నారా? మీరు 18-23 ఏళ్ల మధ్య వయసున్న యువతులైతే ఈ బృహత్తర అవకాశం మీ కోసమే! మీరు చేయాల్సిందల్లా.. మీ జీవితంలో మీకు అత్యంత ఎక్కువగా ప్రేరణనిస్తున్న మహిళ ఎవరో, అందుకు కారణాలేంటో సూటిగా తెలియజేస్తూ ఓ వీడియోను పంపడమే. దాని నిడివి ఒక నిమిషం కంటే ఎక్కువ ఉండకూడదు. ట్విటర్‌, ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌.. ఈ మూడింటిలో ఏదో ఒక సామాజిక మాధ్యమం వేదికగా #DayoftheGirl హ్యాష్‌ట్యాగ్‌ను ఉపయోగిస్తూ, @UKinindia ను ట్యాగ్‌ చేసి వీడియోను పోస్ట్‌ చేయాలి. సెప్టెంబరు 2 అందుకు తుది గడువు. ఈ పోటీలో విజేతగా నిలిచే యువతికి భారత్‌లో బ్రిటన్‌ హైకమిషనర్‌గా ఒకరోజుపాటు విధులు నిర్వర్తించే అవకాశం లభిస్తుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు