వదంతులను ట్వీట్‌ చేశారంటూ సౌదీ మహిళకు 34 ఏళ్ల జైలుశిక్ష

వదంతులను ట్వీట్‌ చేశారన్న అభియోగాలపై సౌదీ అరేబియాలో ఓ మహిళకు కోర్టు 34 ఏళ్ల జైలుశిక్ష విధించడం సంచలనం సృష్టించింది. సల్మా అల్‌ షెబాబ్‌ సౌదీలో మైనారిటీగా

Published : 19 Aug 2022 07:17 IST

దుబాయ్‌: వదంతులను ట్వీట్‌ చేశారన్న అభియోగాలపై సౌదీ అరేబియాలో ఓ మహిళకు కోర్టు 34 ఏళ్ల జైలుశిక్ష విధించడం సంచలనం సృష్టించింది. సల్మా అల్‌ షెబాబ్‌ సౌదీలో మైనారిటీగా ఉన్న షియా ముస్లిం వర్గానికి చెందినవారు. ఆమెకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. బ్రిటన్‌లోని లీడ్స్‌ విశ్వవిద్యాలయంలో పరిశోధక విద్యార్థిగా ఉన్న ఆమె గత ఏడాది జనవరిలో సెలవులకు సౌదీ రాగా.. పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ట్వీట్ల ద్వారా వదంతులను ప్రచారం చేశారని, సౌదీలో అసమ్మతి నేతల ట్వీట్లను రీట్వీట్‌ చేశారని ఆమెపై అభియోగాలు మోపారు. వీటిపై విచారణ నిర్వహించిన కోర్టు తొలుత ఆరేళ్ల జైలుశిక్ష విధించింది. ఆ తీర్పును అల్‌ షెబాబ్‌ సవాలు చేయగా.. పైకోర్టు ఆమెకు 34 ఏళ్ల కారాగారవాసాన్ని ఖరారు చేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని