అమెరికా గ్రీన్‌కార్డుకు రాజపక్స దరఖాస్తు

తీవ్రస్థాయిలో వ్యక్తమైన ప్రజాందోళనలతో దేశం విడిచి వెళ్లిపోయిన శ్రీలంక మాజీ అధ్యక్షుడు గొటబాయ రాజపక్స ఇప్పుడు అమెరికాకు తిరిగి చేరుకుని కుటుంబంతో అక్కడే స్థిరపడాలని

Published : 19 Aug 2022 05:22 IST

కొలంబో: తీవ్రస్థాయిలో వ్యక్తమైన ప్రజాందోళనలతో దేశం విడిచి వెళ్లిపోయిన శ్రీలంక మాజీ అధ్యక్షుడు గొటబాయ రాజపక్స ఇప్పుడు అమెరికాకు తిరిగి చేరుకుని కుటుంబంతో అక్కడే స్థిరపడాలని భావిస్తున్నారు. దీనికి అవసరమైన గ్రీన్‌కార్డు కోసం ఆయన ప్రయత్నిస్తున్నారని మీడియా కథనమొకటి వెల్లడించింది. భార్య లొమా రాజపక్స అమెరికా పౌరురాలు కావడంతో గ్రీన్‌కార్డుకు దరఖాస్తు చేసుకునేందుకు రాజపక్సకు అర్హత ఉందనీ, అమెరికాలో ఆయన తరఫు న్యాయవాదులు గత నెలలోనే దీనికి సంబంధించిన ప్రక్రియను ప్రారంభించారని తెలిపింది. 2019లో శ్రీలంక అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయడానికిగానూ ఆయన అమెరికా పౌరసత్వాన్ని వదులుకున్నారు. ప్రస్తుతం థాయిలాండ్‌లో ఉన్న రాజపక్స ఈ నెల 25న శ్రీలంకకు తిరిగి రానున్నారు. విదేశీ మారకద్రవ్య నిల్వల పరంగా శ్రీలంక పరిస్థితి ఇప్పుడు కొంత మెరుగుపడిందని సెంట్రల్‌ బ్యాంక్‌ గవర్నర్‌ నందలాల్‌ వీరసింఘే చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని