Obesity: మెదడు విశ్లేషణతో స్థూలకాయ సమస్యకు పరిష్కారం

రకరకాల ఆహార పదార్థాలను తింటున్నప్పుడు మనకు ఒక అనుభూతి కలుగుతుంది. దాన్ని బట్టే వాటిని ఇంకొంచెం వడ్డించుకోవాలా? ఇక అక్కడితో ఆపేయాలా? అన్నది నిర్ణయించుకుంటాం. అయితే, మంచి అనుభూతి కలిగిస్తున్న పదార్థాలను

Updated : 28 Aug 2022 09:51 IST

వాషింగ్టన్‌: రకరకాల ఆహార పదార్థాలను తింటున్నప్పుడు మనకు ఒక అనుభూతి కలుగుతుంది. దాన్ని బట్టే వాటిని ఇంకొంచెం వడ్డించుకోవాలా? ఇక అక్కడితో ఆపేయాలా? అన్నది నిర్ణయించుకుంటాం. అయితే, మంచి అనుభూతి కలిగిస్తున్న పదార్థాలను అదేపనిగా, అతిగా తినడం వల్లే చాలామంది అధిక బరువు, స్థూలకాయ సమస్యను ఎదుర్కొంటున్నారు. సరిగ్గా ఈ అంశాన్ని ఆధారం చేసుకునే... స్థూలకాయ సమస్యకు పరిష్కారం కనుగొనేందుకు యూనివర్సిటీ ఆఫ్‌ మిషిగాన్‌ శాస్త్రవేత్తలు ఇటీవల వైవిధ్య పరిశోధన సాగించారు. తిన్న ఆహారం పేగుల్లోకి చేరినప్పుడు... దాని పరిమాణం, లక్షణాలు, సంతృప్తి స్థాయికి సంబంధించిన సంకేతాలు మెదడులోని ‘హైండ్‌బ్రెయిన్‌’గా పిలిచే భాగానికి చేరతాయి. వీటి ఆధారంగానే అందుబాటులో ఉన్న ఆహార పదార్థాల్లో వేటిని తినాలి? వేటిని వదిలిపెట్టాలి? ఇంకా ఎంత తినాలి? తినడం ఎప్పుడు ముగించాలి? అన్న నిర్ణయం జరుగుతుంది. ఈ హైండ్‌మ్రెయిన్‌ను ‘మ్యాపింగ్‌’ సాంకేతికతతో విశ్లేషించడం ద్వారా... స్థూలకాయుల ఆహార అనుభూతిలో మార్పులు తీసుకురావచ్చని, తద్వారా ఇష్టమైన వాటిని కూడా తక్కువగా తినేలా చేసి వారిని అధిక బరువు సమస్య నుంచి కాపాడవచ్చని పరిశోధకులు వివరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని