కబళిస్తున్న టైప్‌-1 మధుమేహం!

ప్రపంచవ్యాప్తంగా టైప్‌-1 మధుమేహ బాధితుల సంఖ్య గత ఏడాది 84 లక్షలుగా ఉన్నట్లు లాన్సెట్‌ ఓ అధ్యయన నివేదికలో వెల్లడించింది. 2040 కల్లా ఆ సంఖ్య కనిష్ఠంగా 1.35 కోట్ల నుంచి గరిష్ఠంగా 1.74 కోట్ల వరకు చేరుకునే ముప్పుందని

Published : 22 Sep 2022 04:54 IST

 2021లో 84 లక్షలుగా నమోదైన బాధితుల సంఖ్య

వ్యాధి ప్రబలంగా ఉన్న టాప్‌-10 దేశాల్లో భారత్‌

మెల్‌బోర్న్‌: ప్రపంచవ్యాప్తంగా టైప్‌-1 మధుమేహ బాధితుల సంఖ్య గత ఏడాది 84 లక్షలుగా ఉన్నట్లు లాన్సెట్‌ ఓ అధ్యయన నివేదికలో వెల్లడించింది. 2040 కల్లా ఆ సంఖ్య కనిష్ఠంగా 1.35 కోట్ల నుంచి గరిష్ఠంగా 1.74 కోట్ల వరకు చేరుకునే ముప్పుందని తెలిపింది. టైప్‌-1 మధుమేహులు అత్యధికంగా ఉన్న 10 దేశాల్లో భారత్‌ కూడా ఒకటని పేర్కొంది. ఈ అధ్యయన నివేదిక ప్రకారం..

* 1.75 లక్షలు - టైప్‌-1 మధుమేహం కారణంగా గత ఏడాది ప్రాణాలు కోల్పోయినవారి సంఖ్య. మృతుల్లో 8,700 మంది దక్షిణాసియాకు చెందినవారు.


టైప్‌-1 మధుమేహ బాధితుల సంఖ్య (2021లో) - 84 లక్షలు

వారిలో 20 ఏళ్ల వయసులోపువారు - 18%

20-59 ఏళ్ల మధ్య వయసున్నవారు - 63%

60 ఏళ్లు, అంతకంటే ఎక్కువున్నవారు - 19%


‘టైప్‌-1’ ప్రబలంగా ఉన్న టాప్‌-10 దేశాలు

అమెరికా, భారత్‌, బ్రెజిల్‌, చైనా, జర్మనీ, బ్రిటన్‌, రష్యా, కెనడా, సౌదీ అరేబియా, స్పెయిన్‌

మొత్తం టైప్‌-1 మధుమేహ బాధితుల్లో 60% మంది ఈ పది దేశాల్లోనే ఉన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని