‘సైనిక సమీకరణ’తో రష్యన్ల బెంబేలు

ఉక్రెయిన్‌పై దాడులను తీవ్రతరం చేసేందుకు... మూడు లక్షల మందితో పాక్షిక సైనిక సమీకరణ చేపట్టాలంటూ అధ్యక్షుడు పుతిన్‌ ఆదేశించడం రష్యన్ల గుండెల్లో గుబులు రేపుతోంది. యుద్ధ

Published : 23 Sep 2022 04:39 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఉక్రెయిన్‌పై దాడులను తీవ్రతరం చేసేందుకు... మూడు లక్షల మందితో పాక్షిక సైనిక సమీకరణ చేపట్టాలంటూ అధ్యక్షుడు పుతిన్‌ ఆదేశించడం రష్యన్ల గుండెల్లో గుబులు రేపుతోంది. యుద్ధ విధుల్లో చేరాలన్న ఆదేశాలు ఏక్షణమైనా రావచ్చన్న ఆందోళన వారిలో నెలకొంది. సైన్యంలో కొన్నిరోజుల పనిచేసి ప్రస్తుతం రిజర్వ్‌గా ఉన్న 35 ఏళ్లలోపు పురుషులను విధుల్లోకి తీసుకోనున్నారు. ఇప్పటికే వీరిలో కొంతమందికి నోటీసులు అందాయి. ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని అధికారుల నుంచి ఆదేశాలూ వచ్చాయి. దీన్ని తప్పించుకునేందుకు భారీ సంఖ్యలో ప్రజలు దేశం విడిచి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే రష్యా నుంచి వెళ్లే విమానాలు ప్రయాణికులతో నిండిపోతున్నాయి. ఆయా సంస్థలు టికెట్ల ధరలను అమాంతం పెంచేసినా.. ఆర్మేనియా, జార్జియా, అజర్‌బైజాన్‌, కజక్‌స్థాన్‌ వెళ్లే విమానాల టికెట్లు క్షణాల్లో అమ్ముడయ్యాయి. శనివారం వరకూ టికెట్లన్నీ బుక్‌ అయిపోయాయి. ఈ పరిణామంతో- ప్రభుత్వం తమపై మార్షల్‌ చట్టం ప్రయోగించవచ్చన్న ఆందోళన విమానయాన సంస్థల్లో నెలకొంది. దీంతో 18-65 ఏళ్ల వయసు పురుషులకు ఆ సంస్థలు టికెట్ల విక్రయాన్ని నిలిపివేసినట్టు స్థానిక మీడియాలో కథనాలు వచ్చాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని