కొత్త ఔషధంతో నాడీ వ్యాధులు తగ్గుముఖం

మెదడు, వెన్నుపాములోని మోటార్‌ న్యూరాన్లుగా పిలిచే నాడీ కణజాలం నుంచి కండరాలకు ప్రసారమయ్యే సందేశాలే మన కాళ్లు, చేతులతో పనిచేయిస్తాయి. అయితే, మోటార్‌ న్యూరాన్‌ డిసీజ్‌

Published : 24 Sep 2022 05:15 IST

లండన్‌: మెదడు, వెన్నుపాములోని మోటార్‌ న్యూరాన్లుగా పిలిచే నాడీ కణజాలం నుంచి కండరాలకు ప్రసారమయ్యే సందేశాలే మన కాళ్లు, చేతులతో పనిచేయిస్తాయి. అయితే, మోటార్‌ న్యూరాన్‌ డిసీజ్‌ (ఎంఎన్‌డీ) సోకితే... ఈ సందేశాలు కండరాలకు చేరకుండా క్రమంగా నిలిచిపోతాయి. చివరకు కాళ్లూ చేతులూ చచ్చుబడిపోతాయి. దీంతో వ్యాధిగ్రస్థుడు కదలడం, నడవడం, మాట్లాడటం, తినడం, చివరకు శ్వాసతీసుకోవడం కూడా కష్టమవుతుంది. 2% ఎంఎన్‌డీ కేసులకు ఎస్‌వోడీ1 అనే జన్యువులోని లోపాలు కారణమవుతున్నాయి. అయితే, టోఫెర్సెన్‌ అనే కొత్త మందును ఏడాదిపాటు తీసుకున్న ఇలాంటి బాధితుల శారీరక పరిస్థితి బాగా మెరుగైనట్టు బ్రిటన్‌కు చెందిన షెఫీల్డ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ట్రాన్స్‌లేషనల్‌ న్యూరోసైన్స్‌ సంస్థ పరిశోధకులు నిర్ధారించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని