ఇరాన్‌లో ఆరని నిరసన జ్వాలలు

హిజాబ్‌ను ధరించడానికి వ్యతిరేకంగా ఇరాన్‌లో చెలరేగిన నిరసన జ్వాలలు కొనసాగుతున్నాయి. ఆందోళనకారులు శుక్రవారం అక్కడి భద్రతా సిబ్బందితో ఘర్షణపడ్డారు. పోలీసు కస్టడీలో మృతి చెందిన 22 ఏళ్ల మాసా అమీని అంత్యక్రియలు జరిగిన

Published : 24 Sep 2022 05:50 IST

ఆందోళనల్లో 26 మంది మృతి చెందారని ఆ దేశ ఛానల్‌ అంచనా

దుబాయ్‌: హిజాబ్‌ను ధరించడానికి వ్యతిరేకంగా ఇరాన్‌లో చెలరేగిన నిరసన జ్వాలలు కొనసాగుతున్నాయి. ఆందోళనకారులు శుక్రవారం అక్కడి భద్రతా సిబ్బందితో ఘర్షణపడ్డారు. పోలీసు కస్టడీలో మృతి చెందిన 22 ఏళ్ల మాసా అమీని అంత్యక్రియలు జరిగిన నాటి(గత శనివారం) నుంచి గురువారం వరకు జరిగిన నిరసనల్లో 26 మంది ఆందోళనకారులు, పోలీసు సిబ్బంది మృతిచెంది ఉంటారని ఆ దేశ టీవీ ఛానల్‌ అంచనా వేసింది. ప్రభుత్వ యంత్రాంగం మృతుల సంఖ్యను ఎలా లెక్కగట్టిందన్న విషయాన్ని మాత్రం వెల్లడించలేదు. అధికారిక గణాంకాలు తరవాత వెల్లడవుతాయని ఆ టీవీ వ్యాఖ్యాత పేర్కొన్నారు.

హిజాబ్‌ను సరిగా ధరించలేదన్న కారణంగా కుర్దిస్థాన్‌ ప్రావిన్స్‌ ప్రాంతానికి చెందిన మాసా అమీనిని నైతిక విభాగం పోలీసులు అరెస్టు చేయగా.. వారి కస్టడీలో తీవ్రంగా గాయపడ్డ ఆ యువతి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించింది. దీంతో పోలీసుల తీరును వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా నిరసనలు పెల్లుబుకుతున్నాయి. ఐరాస కూడా ఈ ఘటనను ఖండించింది. పోలీసులు మాత్రం గుండెపోటుతోనే ఆమె మరణించిందని పేర్కొంటున్నారు. అరెస్టు సమయంలో అమీని ఇస్లామిక్‌ దేశం నిర్దేశించి ప్రకారం తలకు స్కార్ఫ్‌ ధరించినట్లు వీడియోల్లో కనిపిస్తోంది. కొన్ని ఇతర దేశాలు, తమ వ్యతిరేక శక్తులు ఇరాన్‌లో ఆందోళనకారులను రెచ్చగొడుతూ అశాంతిని, అలజడులను సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నాయని అక్కడి అధికారులు ఆరోపిస్తున్నారు. మరోవైపు ఇరాన్‌ ప్రభుత్వం.. అక్కడి ప్రజలకు బయటి ప్రపంచంతో సంబంధం లేకుండా ఇంటర్‌నెట్‌ సేవలకు పరిమితులు విధించి ర్యాలీలు, నిరసనలు ఇతర ప్రాంతాలకు వ్యాప్తిచెందకుండా ఇన్‌స్టాగ్రాం, వాట్సప్‌ తదితర సామాజిక మాధ్యమాలపై ఆంక్షలను కఠినతరం చేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని