ఒకసారి వాడిపారేసే ప్లాస్టిక్‌కు విరుగుడు

ఒకసారి వాడిపారేసే ప్లాస్టిక్‌ పెద్ద బెడదగా మారింది. దీనికి మెరుగైన ప్రత్యామ్నాయాన్ని బ్రిటిష్‌ కొలంబియా విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. ఇందుకోసం చెట్ల నుంచి వచ్చే

Updated : 25 Sep 2022 05:20 IST

వాషింగ్టన్‌: ఒకసారి వాడిపారేసే ప్లాస్టిక్‌ పెద్ద బెడదగా మారింది. దీనికి మెరుగైన ప్రత్యామ్నాయాన్ని బ్రిటిష్‌ కొలంబియా విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. ఇందుకోసం చెట్ల నుంచి వచ్చే కలప ఫైబర్లను ఉపయోగించారు. వాటికి కోల్డ్‌ సోడియం హైడ్రాక్సైడ్‌ జోడించారు. ఆ తర్వాత ఆ రసాయనాన్ని రీసైకిల్‌ చేశారు. ఫలితంగా పారదర్శకత కలిగిన, బలమైన, నీటిని వికర్షించే పొర ఏర్పడింది. నిజానికి చాలామంది పరిశోధకులు ఇలాంటి సెల్యులోజ్‌ పొరలను తయారుచేశారు. చాలా తక్కువగా ఇంధనం, రసాయనాలను ఉపయోగించి దాన్ని ఉత్పత్తి చేయడం ఇదే మొదటిసారి. సంప్రదాయ ప్లాస్టిక్‌ల తరహాలో ఈ పొరనూ వివిధరకాల ఉత్పత్తులుగా మలచవచ్చు. వాడకం తర్వాత వీటిని నేలలో పూడ్చిపెడితే మూడువారాల్లోనే విచ్ఛిన్నమైపోతాయి. కొన్నిరకాల ప్లాస్టిక్‌లు నేలలో కలిసిపోవడానికి లక్షల సంవత్సరాలు పడుతుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని