Heart Failure: గుండె వైఫల్యాన్ని ఇక ఇట్టే తెలుసుకోవచ్చు

గుండె వైఫల్యాన్ని అత్యంత త్వరగా గుర్తించే వినూత్న సాంకేతికతను యూనివర్సిటీ ఆఫ్‌ ఈస్ట్‌ ఆంగ్లియా పరిశోధకులు అభివృద్ధి చేశారు. సంప్రదాయ ఎంఆర్‌ఐ ద్వారా హృద్రోగ నిర్ధారణకు 20 నిమిషాలు పడుతుంటే- శాస్త్రవేత్తలు

Updated : 25 Sep 2022 08:37 IST

లండన్‌: గుండె వైఫల్యాన్ని అత్యంత త్వరగా గుర్తించే వినూత్న సాంకేతికతను యూనివర్సిటీ ఆఫ్‌ ఈస్ట్‌ ఆంగ్లియా పరిశోధకులు అభివృద్ధి చేశారు. సంప్రదాయ ఎంఆర్‌ఐ ద్వారా హృద్రోగ నిర్ధారణకు 20 నిమిషాలు పడుతుంటే- శాస్త్రవేత్తలు రూపొందించిన తాజా సాంకేతికత ఫలితంగా కేవలం 8 నిమిషాల్లోనే ఈ ప్రక్రియ పూర్తవుతున్నట్టు పరిశోధనకర్త హోసమాదిన్‌ అసాది వెల్లడించారు. ‘‘ఎంఆర్‌ఐ సాంకేతికతను ఉపయోగించడం ద్వారా గుండె రక్త ప్రవాహానికి సంబంధించి 4 డైమెన్షనల్‌ చిత్రాలను అభివృద్ధి చేశాం. ‘ఫోర్‌డీ ఫ్లో ఎంఆర్‌ఐ’గా పిలుస్తున్న ఈ టెక్నాలజీ... గుండె కవాటాలు, రక్త ప్రసరణకు సంబంధించి అత్యంత కచ్చితమైన చిత్రాలను అందిస్తోంది. తద్వారా సమస్యను లోతుగా అర్థం చేసుకుని, మెరుగైన చికిత్సను సత్వరం అందించేందుకు అవకాశం ఉంటుంది’’ అని పరిశోధకులు పేర్కొన్నారు. యూరోపియన్‌ రేడియాలజీ ఎక్స్‌పెరిమెంటల్‌ పత్రిక ఈ వివరాలు అందించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని