Al Zawahiri: ఇలా తయారు చేశారు.. అలా హతమార్చారు!

కరడుగట్టిన ఉగ్రముఠా అల్‌ఖైదా అధిపతి అల్‌ జవహరిని అమెరికా సెంట్రల్‌ ఇంటెలిజెన్స్‌ ఏజెన్సీ (సీఐఏ) ఎలా హతమార్చింది? జవహరి ఇంటి నమూనాను పక్కాగా తయారు చేసి, అధ్యక్షుడు

Updated : 24 Nov 2022 14:39 IST

‘సీఐఏ మ్యూజియం’లో అల్‌ జవహరి ఆపరేషన్‌ వస్తువులు

వాషింగ్టన్‌: కరడుగట్టిన ఉగ్రముఠా అల్‌ఖైదా అధిపతి అల్‌ జవహరిని అమెరికా సెంట్రల్‌ ఇంటెలిజెన్స్‌ ఏజెన్సీ (సీఐఏ) ఎలా హతమార్చింది? జవహరి ఇంటి నమూనాను పక్కాగా తయారు చేసి, అధ్యక్షుడు బైడెన్‌కు ఎలా వివరించింది? ఇంతకీ ఆ ఇంటి నమూనా ఇప్పుడు ఎక్కడుంది? జవహరిని హతమార్చేందుకు వాడిన వస్తువులు ఎక్కడున్నాయి? సీఐఏ అత్యంత రహస్యంగా ఉపయోగించే ఆయుధాలు ఏమిటి? ఇలాంటి ప్రశ్నలన్నింటికీ వాషింగ్టన్‌లోని ‘సీఐఏ మ్యూజియం’ సమాధానంగా నిలుస్తోంది.

ఎలాంటి శబ్దం, మంట, పొగ లేకుండా.. అదే ఇంట్లో నివసించే ఏ ఒక్కరికీ ఏ మాత్రం హాని కలగకుండా అల్‌ జవహరిని హతమార్చిన సీఐఏ.. ఆ ప్రణాళికను పక్కాగా అమలు చేసేందుకు తాము పన్నిన వ్యూహాన్ని ప్రజల ముందుకు తెచ్చింది. జవహరి ఇంటి నమూనాతో సహా ఆ ఆపరేషన్‌లో వినియోగించిన వస్తువులను ప్రస్తుతం సీఐఏ మ్యూజియంలో భద్రపరిచారు. నాడు ఉపయోగించిన హెలికాప్టర్లు, యుద్ధ విమానాలు, మ్యాప్‌లు సహా ఎన్నో అరుదైన వస్తువులను ఈ మ్యూజియంలో ఉంచారు. ఈ ఒక్క ఆపరేషనే కాకుండా.. సీఐఏ చేపట్టిన అనేక ప్రతిష్ఠాత్మక ఆపరేషన్లు, వినియోగించిన రహస్య ఆయుధాలను కూడా ఈ మ్యూజియంలో భద్రపరిచారు.

దీన్ని సందర్శించేందుకు ప్రజలకు ఇంకా అనుమతి ఇవ్వలేదు. సీఐఏ ఉద్యోగులు, ప్రత్యేక అతిథులకు మాత్రమే ఈ అవకాశం కల్పిస్తున్నారు. అమెరికా చట్టసభ సభ్యులు, నిఘా సంస్థల అధికారులు, విదేశీ అతిథులకు ఇందుకు అనుమతి ఇస్తున్నారు. సీఐఏను స్థాపించి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా కొత్తగా పునరుద్ధరించిన ఈ మ్యూజియంలోకి పాత్రికేయులకు అనుమతి ఇచ్చారు. సీఐఏ తన చరిత్రను ప్రజలతో పంచుకోవాలని భావిస్తోందని.. దీనికి మరింత సమయం పడుతుందని మ్యూజియం నిర్వాహకులు తెలిపారు.

Read latest World News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని