చిన్న చర్యలతోనూ పెద్ద ప్రభావం

ప్లాస్టిక్‌ వాడకాన్ని తగ్గించండి. నీటి వనరులను సంరక్షించండి. ఆహార వ్యర్థాన్ని నివారించండి. వీటిపై ఇతరులకూ అవగాహన కల్పించండి.

Published : 27 Sep 2022 04:44 IST

ప్లాస్టిక్‌ వాడకాన్ని తగ్గించండి. నీటి వనరులను సంరక్షించండి. ఆహార వ్యర్థాన్ని నివారించండి. వీటిపై ఇతరులకూ అవగాహన కల్పించండి. వాతావరణ మార్పులను అరికట్టే దిశగా చేపట్టే ప్రతి ఒక్క చిన్న చర్య పెద్ద ప్రభావాన్ని చూపుతుంది. భావితరాలకు స్ఫూర్తినిస్తుంది.

- యునెస్కో


అమెరికన్ల అభీష్టానికి విరుద్ధంగా రిపబ్లికన్ల వైఖరి

సెనేట్‌లో ఉన్న రిపబ్లికన్‌ పార్టీ సభ్యులు దేశవ్యాప్తంగా గర్భ విచ్ఛిత్తి ప్రక్రియపై సంపూర్ణ నిషేధం విధించడంతోపాటు, అబార్షన్లు నిర్వహించే వైద్యులపై నేరాభియోగాలు మోపేందుకు ఉద్దేశించిన బిల్లును ఆమోదింపజేసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఆరోగ్య సంబంధ, ఇతర కారణాల రీత్యా స్వచ్ఛందంగా అబార్షన్‌ చేయించుకోవాలనుకునే మహిళలకు దీనివల్ల ఇబ్బందులు ఎదురు కానున్నాయి. రిపబ్లికన్ల వైఖరి మెజారిటీ అమెరికన్ల అభీష్టానికి విరుద్ధంగా ఉంది.

- కమలా హారిస్‌


పంట నుంచి నోటికి చేరేలోపు పెద్ద ఎత్తున వృథా  

ఏటా ఉత్పత్తి అయిన మొత్తం ఆహార ధాన్యాల్లో 14 శాతం పంట పొలాల నుంచి మార్కెట్‌కు తరలించేలోపు వృథా అవుతున్నాయి. అందుబాటులో ఉన్న ఆహారపదార్థాల్లో 17 శాతం వృథా అవుతున్నాయి. ఇందులో 11 శాతం ఇళ్లలో జరుగుతున్న వృథానే.

- ఆహార, వ్యవసాయ సంస్థ (ఐరాస అనుబంధం)

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని