Diabetes in Children: కొవిడ్‌తో పిల్లలకు మధుమేహ ముప్పు!

కొవిడ్‌-19 బారినపడిన పిల్లలు, కౌమారప్రాయులకు టైప్‌-1 మధుమేహం ముప్పు బాగా పెరుగుతున్నట్లు తాజా అధ్యయనం తేల్చింది. 13 దేశాల్లో 18 ఏళ్ల లోపు వయసున్న 10 లక్షల మందిపై దీన్ని నిర్వహించారు. కొవిడ్‌ సోకాక ఆరు

Updated : 27 Sep 2022 08:37 IST

వాషింగ్టన్‌: కొవిడ్‌-19 బారినపడిన పిల్లలు, కౌమారప్రాయులకు టైప్‌-1 మధుమేహం ముప్పు బాగా పెరుగుతున్నట్లు తాజా అధ్యయనం తేల్చింది. 13 దేశాల్లో 18 ఏళ్ల లోపు వయసున్న 10 లక్షల మందిపై దీన్ని నిర్వహించారు. కొవిడ్‌ సోకాక ఆరు నెలలలోపు వీరిలో అనేక మంది కొత్తగా మధుమేహం బారినపడుతున్నట్లు గుర్తించారు. కరోనా బారినపడని వారితో పోలిస్తే ఇలాంటివారిలో వ్యాధి ముప్పు 73 శాతం అధికమని తేల్చారు. అయితే దీనికి ఇన్‌ఫెక్షనే కారణమా అన్నది ఇంకా వెల్లడి కాలేదు. టైప్‌-1 మధుమేహాన్ని ఆటోఇమ్యూన్‌ వ్యాధిగా పరిగణిస్తారు. ఈ రుగ్మత ఉన్నవారిలో శరీర రోగనిరోధక వ్యవస్థ.. ఇన్సులిన్‌ను వెలువరించే కణాలపై దాడి చేస్తుంది. ఫలితంగా ఆ హార్మోన్‌ ఉత్పత్తి ఆగిపోయి మధుమేహం వస్తుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని