నార్డ్‌ స్ట్రీమ్‌ గ్యాస్‌ పైపులైన్లలో లీకేజీ

సహజవాయువును రష్యా నుంచి జర్మనీకి తీసుకొచ్చే నార్డ్‌ స్ట్రీమ్‌ 1, 2 గొట్టపు మార్గాల్లో మంగళవారం అసాధారణంగా మూడుచోట్ల లీకేజీ సంభవించింది. ఇంధనం కోసం రష్యాపై ఆధారపడాల్సిన అగత్యాన్ని తప్పించుకోవడానికి

Published : 28 Sep 2022 04:56 IST

విద్రోహ చర్యగా అనుమానాలు

వార్సా: సహజవాయువును రష్యా నుంచి జర్మనీకి తీసుకొచ్చే నార్డ్‌ స్ట్రీమ్‌ 1, 2 గొట్టపు మార్గాల్లో మంగళవారం అసాధారణంగా మూడుచోట్ల లీకేజీ సంభవించింది. ఇంధనం కోసం రష్యాపై ఆధారపడాల్సిన అగత్యాన్ని తప్పించుకోవడానికి ఐరోపా దేశాలు ప్రయత్నిస్తున్న సమయంలోనే చోటు చేసుకున్న ఈ ఘటన విద్రోహ చర్యేనని పోలెండ్‌, డెన్మార్క్‌ ప్రధానమంత్రులు భావిస్తున్నారు. రష్యా గ్యాస్‌కు ప్రత్యామ్నాయంగా నార్వే నుంచి పోలెండ్‌కు సహజవాయువును తీసుకొచ్చే బాల్టిక్‌ పైపునకు మంగళవారం ప్రారంభోత్సవం జరిగిన సమయంలోనే నార్డ్‌ స్ట్రీమ్‌ పైపులైన్లలో లీకేజీలు తలెత్తడం కాకతాళీయం కాదనీ, పనిగట్టుకుని చేసిన విధ్వంస చర్య అనే వాదన బలం పుంజుకుంది. ఉక్రెయిన్‌పై రష్యా దండయాత్రతో నార్డ్‌ స్ట్రీమ్‌ 1 పైపులైను మూతబడింది. నార్డ్‌ స్ట్రీమ్‌ 2 అసలు ప్రారంభమే కాలేదు. గ్యాస్‌ దిగుమతికి జర్మనీ నిరాకరించడమే దీనికి కారణం. రెండు పైపులైన్లలో నిండుగా గ్యాస్‌ ఉన్నా అది ఎక్కడిదక్కడ నిలిచిపోయింది. లీకేజీ జరిగిన జలాల్లోకి నౌకలు వెళ్లకుండా డెన్మార్క్‌ నిషేధం విధించింది. పైపులైన్ల లీకేజీకి నిజంగా రష్యాయే కారణమైతే జర్మనీతో, పశ్చిమ యూరప్‌ దేశాలతో అది శాశ్వతంగా తెగదెంపులు చేసుకుంటున్నట్లేనని పరిశీలకులు చెబుతున్నారు. ఇది ఉద్దేశపూర్వకంగా జరిగిన చర్య అని డెన్మార్క్‌ ఆరోపించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని