అబె మరణం నాకు తీరని లోటు : మోదీ
జపాన్ మాజీ ప్రధానమంత్రి షింజో అబె మరణం విషాదకరమని.. వ్యక్తిగతంగా తనకు తీరని లోటని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. అబె తుది వీడ్కోలు కార్యక్రమంలో పాల్గొనేందుకు మంగళవారం టోక్యోకు వెళ్లిన మోదీ.. అమెరికా
టోక్యోలో షింజో అబెకు ఘనంగా తుది వీడ్కోలు
హాజరైన కమలా హారిస్, ఆస్ట్రేలియా ప్రధాని
టోక్యో: జపాన్ మాజీ ప్రధానమంత్రి షింజో అబె మరణం విషాదకరమని.. వ్యక్తిగతంగా తనకు తీరని లోటని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. అబె తుది వీడ్కోలు కార్యక్రమంలో పాల్గొనేందుకు మంగళవారం టోక్యోకు వెళ్లిన మోదీ.. అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్, జపాన్ యువరాణి అకిషినో సహా దాదాపు వంద దేశాల ప్రతినిధులతో కలిసి అబెకు పుష్పాంజలి ఘటించారు. చితాభస్మ కలశాన్ని టోక్యో హాలుకు తీసుకురాగా, దివంగత నేతకు వేలమంది తుది నివాళి అర్పించారు. సైన్యం 19 తుపాకుల అభివాదాన్ని సమర్పించింది. జపాన్ జాతీయగీతం ‘కిమిగయో’ పాడుతున్నపుడు ఆహుతులందరూ లేచి నిలబడ్డారు. కార్యక్రమానికి హాజరైన ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోని ఆల్బనీస్‌తో మోదీ ప్రత్యేక చర్చలు జరిపారు. అనంతరం జపాన్ ప్రధాని ఫ్యూమియో కిషిదతో జరిగిన భేటీలో అబెతో తనకున్న అనుబంధాన్ని నరేంద్ర మోదీ గుర్తు చేసుకున్నారు. ఇండో - పసిఫిక్ ప్రాంత మైత్రి బలోపేతానికి ఆయన ఎంతో కృషి చేశారని, కిషిద సైతం అదే తీరును కొనసాగిస్తారనే నమ్మకం తనకుందని చెప్పారు. ఉక్రెయిన్ యుద్ధంతోపాటు పలు అంశాలపై ఇరు దేశాల ప్రధానుల మధ్య ద్వైపాక్షిక చర్చలు జరిగాయి. అకసాక ప్యాలెస్‌కు వెళ్లి షింజో అబె భార్య అకీ అబెను సైతం కలిసిన మోదీ ఆమెను ఓదార్చారు. మరోవైపు.. అబె తుది వీడ్కోలు కార్యక్రమానికి చేస్తున్న భారీ ఖర్చును వ్యతిరేకిస్తున్నవారు డప్పులు వాయిస్తూ బ్యానర్లు చేతబట్టి టోక్యో వీధుల్లో ప్రదర్శన నిర్వహించారు. జపాన్‌లోని ప్రధాన ప్రతిపక్ష పార్టీలు వీడ్కోలు కార్యక్రమాన్ని బహిష్కరించి, ఆందోళనకు మద్దతు పలికాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
విజయ్ దేవరకొండను పార్టీ అడిగిన రష్మిక.. ఎందుకంటే..?
-
ప్రధాని మోదీ, బిల్‌గేట్స్.. ‘చాయ్ పే చర్చ’
-
‘మిలిటరీ తరహా కోచ్’ అంటూ వీజ్ వ్యాఖ్యలు.. ఆండ్రి రస్సెల్ కౌంటర్
-
నిన్న అమెరికా, నేడు ఐరాస.. భారత అంతర్గత వ్యవహారాలపై వ్యాఖ్యలు!
-
మేనల్లుడికి అత్యున్నతాధికారి నజరానా!
-
ముఖ్యమంత్రితో ముఖాముఖిలో వాలంటీరు