xi jinping : జిన్‌పింగ్‌ గృహనిర్బంధం ఉత్తిదే!

చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌ గృహ నిర్బంధంలో ఉన్నారంటూ ఇటీవల వచ్చిన వార్తలు ఉత్తుత్తివే అనిపించే పరిణామం మంగళవారం చోటుచేసుకుంది. దశాబ్ద కాలంలో చైనా కమ్యూనిస్టు పార్టీ, దేశం సాధించిన ఘనతలపై బీజింగ్‌లో

Updated : 28 Sep 2022 09:20 IST

 బీజింగ్‌లో ప్రదర్శనకు హాజరైన చైనా అధ్యక్షుడు

బీజింగ్‌: చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌ గృహ నిర్బంధంలో ఉన్నారంటూ ఇటీవల వచ్చిన వార్తలు ఉత్తుత్తివే అనిపించే పరిణామం మంగళవారం చోటుచేసుకుంది. దశాబ్ద కాలంలో చైనా కమ్యూనిస్టు పార్టీ, దేశం సాధించిన ఘనతలపై బీజింగ్‌లో ఏర్పాటు చేసిన ఓ ప్రదర్శనలో ఆయన ప్రత్యక్షంగా పాల్గొన్నారు. అంతేకాకుండా చైనా లక్షణాలతో కూడిన సోషలిజం కొత్త విజయం సాధించేందుకు కృతనిశ్చయంతో ముందుకు సాగేలా సమష్టి ప్రయత్నాలు కొనసాగించాలని అక్కడి నేతలను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ మేరకు చైనా అధికార వార్తా సంస్థ జిన్హువా వెల్లడించింది.

ఉజ్బెకిస్థాన్‌లోని సమర్కండ్‌లో జరిగిన షాంఘై సహకార సంస్థ (ఎస్‌సీవో) సదస్సుకు వెళ్లి ఈ నెల 16న తిరిగి వచ్చిన తరువాత జిన్‌పింగ్‌ బహిరంగంగా కనిపించడం ఇదే తొలిసారి. చైనాలో జీరో కొవిడ్‌ విధానాన్ని పాటిస్తున్న నేపథ్యంలో విదేశీ పర్యటనకు వెళ్లి వచ్చిన జిన్‌పింగ్‌ విధిగా నిర్ణీత ప్రదేశంలో ఏడు రోజుల క్వారంటైన్‌, మూడు రోజులు గృహానికే పరిమితమై ఉంటారని పరిశీలకులు పేర్కొన్నారు. దీంతో షీ జిన్‌పింగ్‌ను గృహ నిర్బంధంలో ఉంచారని, పీపుల్స్‌ లిబరేషన్‌ ఆర్మీ(పీఎల్‌ఏ) అధిపతిగా ఉన్న ఆయనను పదవి నుంచి తొలగించారంటూ ఇటీవల వదంతులు పుట్టుకొచ్చాయని తెలుస్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని