చైనా దేశస్థులపై పాక్‌లో దాడి; ఒకరి కాల్చివేత

పాకిస్థాన్‌లోని దక్షణ ఓడరేవు నగరం కరాచీలో ఓ దంత వైద్యశాలలోకి చొరబడిన గుర్తుతెలియని సాయుధుడు జరిపిన కాల్పుల్లో చైనా దేశస్థుడు ఒకరు మృతిచెందగా, ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారు.

Updated : 29 Sep 2022 05:45 IST

కరాచీ: పాకిస్థాన్‌లోని దక్షణ ఓడరేవు నగరం కరాచీలో ఓ దంత వైద్యశాలలోకి చొరబడిన గుర్తుతెలియని సాయుధుడు జరిపిన కాల్పుల్లో చైనా దేశస్థుడు ఒకరు మృతిచెందగా, ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారు. కరాచీలోని రద్దీ ప్రాంతంలో ఉన్న వైద్యశాల లోపలకు రోగిలా వచ్చిన ఆగంతుకుడు డాక్టరు గదిలోకి వచ్చాక కాల్పులు ప్రారంభించాడు. ఈ ఘటనలో వైద్యుడి సహాయకుడు రొనాల్డ్‌ చొ అక్కడికక్కడే మృతిచెందగా.. డాక్టర్‌ రిచర్డ్‌ హు లీ (74), మార్గరెట్‌ (72) దంపతులు గాయపడ్డారు.

Read latest World News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని