అంధకారంలో క్యూబా

క్యూబాలో ఇయన్‌ హరికేన్‌ సృష్టించిన బీభత్సంతో దేశాన్ని చీకట్లు కమ్ముకున్నాయి. ఏకంగా గంటకు 205 కి.మీ. వేగంతో వీచిన భయానక గాలులతో ద్వీపంలోని ఇళ్ల పైకప్పులు, విద్యుత్తు స్తంభాలు,

Updated : 29 Sep 2022 22:32 IST

ఇయన్‌ తుపాను ప్రభావంతో కుప్పకూలిన గ్రిడ్‌

హవానా: క్యూబాలో ఇయన్‌ హరికేన్‌ సృష్టించిన బీభత్సంతో దేశాన్ని చీకట్లు కమ్ముకున్నాయి. ఏకంగా గంటకు 205 కి.మీ. వేగంతో వీచిన భయానక గాలులతో ద్వీపంలోని ఇళ్ల పైకప్పులు, విద్యుత్తు స్తంభాలు, చెట్లు, పొగాకు పంటలు, హరిత పందిళ్లకు తీవ్రనష్టం జరిగింది. దేశ పశ్చిమ ప్రాంతాన్ని తుపాను బలంగా తాకడంతో బుధవారం 1.10 కోట్ల మందికి విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది. సిబ్బంది శ్రమించి రాజధాని హవానా మినహా చాలాచోట్ల సరఫరాను పునరుద్ధరించారు. ఇప్పటికే ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న క్యూబా పరిస్థితి... ప్రస్తుత తుపాన్‌ కారణంగా మరింత దిగజారింది. వేల మంది నిర్వాసితులయ్యారు. బాధిత ప్రాంతాలను అధ్యక్షుడు మిగెల్‌ డియాజ్‌ సందర్శించారు. ఈ హరికేన్‌ గంటకు 209 కి.మీ. వేగంతో అమెరికాలోని ఫ్లోరిడా వైపు దూసుకెళుతోంది. ముందుజాగ్రత్తగా ఫ్లోరిడాలోని 25 లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. స్థానికులు తమ ఇళ్లలోని విలువైన వస్తువులను పైఅంతస్తుల్లోకి చేరుస్తున్నారు.

Read latest World News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts