ఇరాన్‌లో మరో యువతి కాల్చివేత

హిజాబ్‌ వ్యతిరేక ఆందోళనలతో వారం రోజులకు పైగా అట్టుడుకుతున్న ఇరాన్‌లో ఉద్యమిస్తున్న మహిళలపై దమనకాండ కొనసాగుతోంది. హిజాబ్‌ సరిగా ధరించలేదన్న కారణంగా నిర్బంధానికి గురై పది

Published : 29 Sep 2022 05:34 IST

హిజాబ్‌ ఆందోళనలపై ఆగని దమనకాండ

టెహ్రాన్‌: హిజాబ్‌ వ్యతిరేక ఆందోళనలతో వారం రోజులకు పైగా అట్టుడుకుతున్న ఇరాన్‌లో ఉద్యమిస్తున్న మహిళలపై దమనకాండ కొనసాగుతోంది. హిజాబ్‌ సరిగా ధరించలేదన్న కారణంగా నిర్బంధానికి గురై పది రోజుల కిందట పోలీసు కస్టడీలో మృతిచెందిన మహ్సా అమిని (22) విషాదం మరవకముందే.. హదీస్‌ నజాఫీ (20) అనే మరో యువతిని ఇరాన్‌ భద్రతా దళాలు కాల్చి చంపాయి. హిజాబ్‌ లేకుండా ఉన్న విడి జుట్టును ముడివేసి, అమిని మరణంతో జరుగుతున్న ఆందోళనల్లో పాల్గొనడమే నజాఫీ చేసిన పాపం. ఈ వీడియో వైరల్‌ కావడంతో ఇస్లామిక్‌ రిపబ్లిక్‌ భద్రతా దళాలు ఆమెను కిరాతకంగా కాల్చి చంపాయి. మొత్తం ఆరు బుల్లెట్లు ఆమె దేహంలోకి దూసుకుపోయాయి. గత వారం రోజులుగా జరుగుతున్న ఆందోళనల్లో 35 మంది మృతిచెందారు. ఇందులో భద్రతా దళాల చేతుల్లో మృత్యువాతపడ్డవారే అధికం. వందల సంఖ్యలో ఉద్యమకారులను అరెస్టు చేశారు. ఇరాన్‌ మహిళల ఆందోళనకు మద్దతుగా విదేశాల్లోనూ ప్రదర్శనలు జరుగుతున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని