నోబెల్‌ విజేతపై లైంగిక వేధింపుల ఆరోపణలు

ఇండోనేసియా సమీప తిమోర్‌ దీవిలో అందించిన సేవలకుగాను 1996లో నోబెల్‌ శాంతి బహుమతి గెలుచుకున్న కేథలిక్‌ బిషప్‌ కార్లోస్‌ జిమెనెస్‌ బెలోను లైంగిక వేధింపుల ఆరోపణలు చుట్టుముట్టడంతో

Updated : 30 Sep 2022 06:23 IST

వాటికన్‌ సిటీ: ఇండోనేసియా సమీప తిమోర్‌ దీవిలో అందించిన సేవలకుగాను 1996లో నోబెల్‌ శాంతి బహుమతి గెలుచుకున్న కేథలిక్‌ బిషప్‌ కార్లోస్‌ జిమెనెస్‌ బెలోను లైంగిక వేధింపుల ఆరోపణలు చుట్టుముట్టడంతో వాటికన్‌ సిటీ ఉక్కిరిబిక్కిరి అవుతోంది. డచ్‌ పత్రికలో వెలువడ్డ కథనం మేరకు.. 1990ల ప్రాంతంలో తూర్పు తిమోర్‌లో సేవలందించిన బెలో ఆ సమయంలో కొందరు బాలురను లైంగికంగా వేధించారు. పోర్చుగల్‌లో ఉంటున్న బెలోను ఈ ఆరోపణలపై ఓ ప్రయివేటు రేడియో ఫోను ద్వారా వివరణ కోరగా.. ఆయన స్పందించలేదు. నోబెల్‌ కమిటీ, ఐక్యరాజ్య సమితి కూడా దీనిపై వెంటనే ఎటువంటి ప్రకటన చేయలేదు. బిషప్‌ బెలో ప్రవర్తనపై ఆరోపణలు రావడంతో గత రెండేళ్లుగా ఆయనపై  క్రమశిక్షణపరంగా పలు ఆంక్షలను తాము విధించినట్లు వాటికన్‌ సిటీ అధికార ప్రతినిధి బ్రూనీ గురువారం వెల్లడించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని