H1B Visa: అమెరికాలోనే హెచ్‌1బీ వీసాల స్టాంపింగ్.. సిఫార్సులకు ప్రెసిడెన్షియల్‌ కమిషన్‌ ఆమోదం

అమెరికాలోనే హెచ్‌-1బీ వీసాల స్టాంపింగ్‌కు వెసులుబాటు ఇవ్వాలన్న సిఫార్సులకు ఆసియన్‌ అమెరికన్లు, పసిఫిక్‌ ద్వీపవాసులకు సంబంధించిన ప్రెసిడెన్షియల్‌ కమిషన్‌ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది.

Updated : 01 Oct 2022 08:52 IST

వాషింగ్టన్‌: అమెరికాలోనే హెచ్‌-1బీ వీసాల స్టాంపింగ్‌కు వెసులుబాటు ఇవ్వాలన్న సిఫార్సులకు ఆసియన్‌ అమెరికన్లు, పసిఫిక్‌ ద్వీపవాసులకు సంబంధించిన ప్రెసిడెన్షియల్‌ కమిషన్‌ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. ఒకవేళ ఈ సిఫార్సుకు అధ్యక్షుడు జో బైడెన్‌ పచ్చజెండా ఊపితే వేలాదిమంది విదేశీ వృత్తి నిపుణులకు, ముఖ్యంగా భారతీయులకు ఎంతో ఊరట లభిస్తుంది. ప్రస్తుతం అమల్లో ఉన్న నిబంధనల ప్రకారం.. వీసా స్టాంపింగ్‌ కోసం ఆయా దేశాల్లోని అమెరికన్‌ కాన్సులేట్‌/ఎంబసీల్లో ముందుగా దరఖాస్తు చేసుకోవాలి. హెచ్‌-1బీ వీసా పునరుద్ధరణకు, కొత్తగా పొందడానికి ఇంటర్వ్యూ కోసం ప్రస్తుతం సుదీర్ఘ వెయిటింగ్‌ ఉంటోంది. అమెరికాలోనే స్టాంపింగ్‌కు వెసులుబాటు కల్పించే సిఫార్సుకు సంబంధించి ఇటీవల శ్వేతసౌధంలో జరిగిన సమావేశంలో ప్రెసిడెన్షియల్‌ కమిషన్‌ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. దీన్ని అధ్యక్షుడు పరిశీలించాల్సి ఉంది. ప్రస్తుతం హెచ్‌-1బీ వీసాదారులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని భారతీయ అమెరికన్‌ అజయ్‌జైన్‌ భుటోరియా కమిషన్‌ దృష్టికి తీసుకొచ్చారు. అత్యవసర పరిస్థితుల్లోనూ స్వదేశానికి వెళ్లాలంటేనే భయపడే పరిస్థితి ఉందని.. ఆయా దేశాల్లో వీసా అపాయింట్‌మెంట్‌లో చోటుచేసుకుంటున్న జాప్యంపై వారు ఆందోళన చెందుతున్నారని వెల్లడించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని