బీజింగ్‌లో బీయింగ్‌ మహాత్మా నాటిక ప్రదర్శన

కొవిడ్‌ కారణంగా వచ్చిన రెండేళ్ల విరామం తర్వాత.. చైనాలోని విశాలమైన చావోయాంగ్‌ పార్కులో మళ్లీ గాంధీ జయంతి వేడుకలు జరిగాయి. బీజింగ్‌లోని డజను స్కూళ్ల పిల్లలు, ప్రవాస భారతీయులు ఈ పార్కులో సమావేశం కాగా.. మహాత్ముడి బోధలు, భజనలతో ఆ ప్రాంతం ప్రతిధ్వనించింది.

Published : 03 Oct 2022 03:33 IST

బీజింగ్‌: కొవిడ్‌ కారణంగా వచ్చిన రెండేళ్ల విరామం తర్వాత.. చైనాలోని విశాలమైన చావోయాంగ్‌ పార్కులో మళ్లీ గాంధీ జయంతి వేడుకలు జరిగాయి. బీజింగ్‌లోని డజను స్కూళ్ల పిల్లలు, ప్రవాస భారతీయులు ఈ పార్కులో సమావేశం కాగా.. మహాత్ముడి బోధలు, భజనలతో ఆ ప్రాంతం ప్రతిధ్వనించింది. చేతిలో పుస్తకంతో కూర్చొన్న మహాత్ముడి విగ్రహాన్ని ఈ పార్కులో 2005లో ప్రతిష్ఠించారు. గాంధీ విగ్రహ శిల్పి యాన్‌ జికున్‌, చైనాలో భారత రాయబారి ప్రదీప్‌కుమార్‌ రావత్‌ ఈ సందర్భంగా మహాత్ముడి బోధల గురించి మాట్లాడారు. స్థానిక మ్యూజియంలో ప్రదర్శించిన ‘బీయింగ్‌ మహాత్మా’ నాటిక ఈ కార్యక్రమాల్లో విశేషాంశంగా నిలిచింది. భారత ఎంబసీ అధికారి టి.ఎస్‌.వివేకానంద నాటికను రచించి, దర్శకత్వం వహించారు. ఈ కార్యాలయంలోని భద్రతా అధికారి జోజి లుకా మహాత్ముడి పాత్ర పోషించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని