భారత్‌ను రష్యా నుంచి దూరం చేద్దాం

రక్షణ సంబంధాల్లో భారత్‌తో బంధాన్ని మరింత దృఢం చేసుకోవాలని బైడెన్‌ ప్రభుత్వానికి అమెరికా సెనేటర్లు విజ్ఞప్తి చేశారు. ఎప్పటినుంచో రష్యాతో పెనవేసుకుపోయిన ఆ దేశ రక్షణ అవసరాలను క్రమంగా అమెరికా వైపు మళ్లించే ప్రయత్నం చేయాలని వారు కోరారు.

Published : 03 Oct 2022 05:11 IST

అమెరికా సెనేటర్లు

వాషింగ్టన్‌: రక్షణ సంబంధాల్లో భారత్‌తో బంధాన్ని మరింత దృఢం చేసుకోవాలని బైడెన్‌ ప్రభుత్వానికి అమెరికా సెనేటర్లు విజ్ఞప్తి చేశారు. ఎప్పటినుంచో రష్యాతో పెనవేసుకుపోయిన ఆ దేశ రక్షణ అవసరాలను క్రమంగా అమెరికా వైపు మళ్లించే ప్రయత్నం చేయాలని వారు కోరారు. భారత్‌తో స్నేహం.. ఇండో పసిఫిక్‌ ప్రాంతంలో యూఎస్‌ ప్రయోజనాలకు కీలకమని పేర్కొన్నారు. ఈ మేరకు సెనేటర్‌ మార్క్‌ వార్నర్‌, జాక్‌ రీడ్‌, జిమ్‌ ఇన్‌హోఫ్‌.. నేషనల్‌ డిఫెన్స్‌ ఆథరైజేషన్‌ చట్టానికి సవరణ ప్రతిపాదించారు.

1984.. భారత ఆధునిక చరిత్రలోనే చీకటి అధ్యాయం

వాషింగ్టన్‌: సిక్కులపై 1984లో జరిగిన మారణకాండ ఆధునిక భారత చరిత్రలోనే చీకటి అధ్యాయమని అమెరికా రిపబ్లిక్‌ సెనేటర్‌ పాట్‌ టూమీ అన్నారు. ‘‘భవిష్యత్తులో మానవ హక్కులు ఉల్లంఘన జరగకుండా ఉండాలంటే, సిక్కులపై, ఇతరసమూహాలపై దాడులు పునరావృతం కాకుండా నిరోధించాలంటే.. ఆ ఘటనకు బాధ్యులైన వారిని జవాబుదారీ చేయాలి’’ అని సెనేట్‌లో ప్రసంగిస్తూ ఆయన పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని