కొవిడ్‌తో గుండెకు చేటు ఇలా...

కొవిడ్‌-19 కారణంగా గుండె కణజాలానికి ఎలా నష్టం జరుగుతోందన్నది ఆస్ట్రేలియాలోని క్వీన్స్‌ లాండ్‌ వర్సిటీ పరిశోధకులు గుర్తించారు. కొవిడ్‌, ఇన్‌ఫ్లుయెంజా కారక వైరస్‌లు గుండెపై వేర్వేరుగా దుష్ప్రభావం చూపుతున్నాయి.

Updated : 04 Oct 2022 06:21 IST

మెల్‌బోర్న్‌: కొవిడ్‌-19 కారణంగా గుండె కణజాలానికి ఎలా నష్టం జరుగుతోందన్నది ఆస్ట్రేలియాలోని క్వీన్స్‌ లాండ్‌ వర్సిటీ పరిశోధకులు గుర్తించారు. కొవిడ్‌, ఇన్‌ఫ్లుయెంజా కారక వైరస్‌లు గుండెపై వేర్వేరుగా దుష్ప్రభావం చూపుతున్నాయి. అయితే, ఇన్‌ఫ్లుయెంజా వైరస్‌ హృదయ కణజాలంలో తీవ్రమైన వాపును కలిగిస్తే, కరోనా గుండె కణాల్లోని డీఎన్‌ఏకు నష్టం కలిగిస్తున్నట్టు పరిశోధకులు గుర్తించారు. ఫ్లూ కారణంగా  డీఎన్‌ఏకు ఎలాంటి నష్టం ఉండదని తేల్చారు. అందుకే 2009లో విరుచుకుపడిన ఫ్లూ కంటే... 2019లో విజృంభించిన కొవిడ్‌ మహమ్మారే ఎక్కువగా హృదయ సమస్యలను తెచ్చిపెట్టినట్టు పరిశోధకులు విశ్లేషించారు. గుండె జబ్బుల బారిన పడకుండా కొవిడ్‌ బాధితులను కాపాడే చికిత్స రూపకల్పనకు ఈ పరిశోధన దోహదపడగలదని నిపుణులు భావిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని