సంపన్నుల పన్ను రేట్ల రద్దుపై మడమ తిప్పిన ట్రస్‌

పన్నుల తగ్గింపు ప్రణాళికకు సంబంధించి బ్రిటన్‌ ప్రధాని లిజ్‌ ట్రస్‌ మడమ తిప్పారు. సంపన్నులపై భారీ పన్నులను తొలగించడానికి ఉద్దేశించిన విధానాన్ని సోమవారం ఉపసంహరించుకున్నారు.

Updated : 04 Oct 2022 06:14 IST

లండన్‌: పన్నుల తగ్గింపు ప్రణాళికకు సంబంధించి బ్రిటన్‌ ప్రధాని లిజ్‌ ట్రస్‌ మడమ తిప్పారు. సంపన్నులపై భారీ పన్నులను తొలగించడానికి ఉద్దేశించిన విధానాన్ని సోమవారం ఉపసంహరించుకున్నారు. మార్కెట్‌లో నెలకొన్న గందరగోళ పరిస్థితులకు తోడు ఈ విధానంపై అధికార కన్జర్వేటివ్‌ పార్టీ నుంచే విమర్శలు రావొచ్చన్న భయాల నేపథ్యంలోనే ఈ చర్య తీసుకున్నట్లు తెలుస్తోంది. ఛాన్సలర్‌ క్వాసీ క్వార్టెంగ్‌ గత నెలలో ప్రవేశపెట్టిన మినీ బడ్జెట్‌లో అధికాదాయ వర్గాలపై 45 శాతం పన్ను వసూలు చేయడాన్ని రద్దు చేయనున్నట్లు ప్రతిపాదించారు. వచ్చే ఏప్రిల్‌ నుంచి ఈ నిర్ణయం అమలులోకి రావాల్సి ఉంది. అయితే ప్రభుత్వ రుణాలు పెరగడం, డాలర్‌తో పోలిస్తే పౌండ్‌ విలువ క్షీణించడం, పింఛను చెల్లింపులకు నిధుల కొరత తదితర పరిస్థితుల నేపథ్యంలో ఈ ప్రతిపాదనను వెనక్కు తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు క్వార్టెంగ్‌ ట్వీట్‌ చేశారు. మన ఆర్థిక వ్యవస్థ వృద్ధికి, పౌర సేవల్లో ప్రపంచ ప్రమాణాలు అందుకోవడానికి, వేతనాల పెరుగుదలకు, అవకాశాలు సృష్టించుకోవడానికి ఈ నిర్ణయం తీసుకోక తప్పడం లేదంటూ సమర్థించుకున్నారు. సంపన్నులపై అధిక పన్నుల రద్దుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆదివారం బీబీసీ ఇంటర్వ్యూలో చెప్పిన ప్రధాని ట్రస్‌.. మరునాడే మడమ తిప్పడం చర్చనీయాంశమైంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని