Russia: యుద్ధం పేరుతో చంపలేనంటూ రష్యాలో డీజే ఆత్మహత్య

నిర్బంధ సైనిక సమీకరణలో భాగంగా సైన్యంలో చేరాలని నోటీసు అందుకున్న డిస్క్‌ జాకీ (డీజే) ఇవాన్‌ విటలీవిచ్‌ పెటునిన్‌ ఓ భారీ భవనం 10వ అంతస్తు నుంచి దూకి ఆత్మార్పణ చేశాడు.

Updated : 05 Oct 2022 06:54 IST

మాస్కో: నిర్బంధ సైనిక సమీకరణలో భాగంగా సైన్యంలో చేరాలని నోటీసు అందుకున్న డిస్క్‌ జాకీ (డీజే) ఇవాన్‌ విటలీవిచ్‌ పెటునిన్‌ ఓ భారీ భవనం 10వ అంతస్తు నుంచి దూకి ఆత్మార్పణ చేశాడు. క్రాస్నోడార్‌ నగరంలో గత నెల 30న ఈ ఘటన చోటు చేసుకుంది. ఉక్రెయిన్‌పై యుద్ధాన్ని తీవ్రతరం చేసేందుకు సన్నద్ధమవుతోన్న రష్యా ఆ మేరకు భారీగా సైనిక సమీకరణ చేపట్టిన విషయం తెలిసిందే. దీనికి రష్యా పౌరుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. సైన్యంలో చేరాల్సి వస్తుందనే భయంతో ఎంతోమంది పౌరులు ఇప్పటికే దేశాన్ని వీడుతున్నారు. తాజాగా డీజే ఇవాన్‌ తాను యుద్ధంలో ఏ వ్యక్తినీ చంపడానికి సిద్ధంగా లేనని పేర్కొంటూ తనవు చాలించినట్లు స్థానిక మీడియా పేర్కొంది. 27 ఏళ్ల ఈ ర్యాపర్‌.. వాకీ పేరుతో స్టేజి షోలు నిర్వహించేవాడు. ‘ప్రస్తుతం పాక్షిక సైనిక సమీకరణ అని చెబుతున్నప్పటికీ మరికొన్ని రోజుల్లో అది పూర్తి స్థాయిలో జరుగుతుంది. పుతిన్‌ ఒక ఉన్మాది. మీరు ఈ వీడియో చూసే సమయానికి నేను సజీవంగా ఉండను’ అంటూ ఆత్మహత్యకు ముందు తీసుకున్న ఓ సెల్ఫీ వీడియోలో ఇవాన్‌ పేర్కొన్నాడు. గతంలో రష్యా సైన్యంలో పనిచేసిన ఇవాన్‌.. మానసిక చికిత్స కూడా తీసుకున్నట్లు అమెరికా మీడియా వెల్లడించింది.

Read latest World News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts