రష్యా నష్టాలకు నిదర్శనం ఈ మృతదేహాలు

తూర్పు ఉక్రెయిన్‌ నగరాల్లో వీధుల్లో పెద్దఎత్తున పడిఉన్న రష్యా సైనికుల మృతదేహాలే ఆ దేశానికి వాటిల్లిన నష్టాలకు నిదర్శనమని ఉక్రెయిన్‌ అధికార వర్గాలు అంటున్నాయి.

Published : 05 Oct 2022 06:13 IST

కీవ్‌: తూర్పు ఉక్రెయిన్‌ నగరాల్లో వీధుల్లో పెద్దఎత్తున పడిఉన్న రష్యా సైనికుల మృతదేహాలే ఆ దేశానికి వాటిల్లిన నష్టాలకు నిదర్శనమని ఉక్రెయిన్‌ అధికార వర్గాలు అంటున్నాయి. రష్యా దళాలు వైదొలగిన లైమాన్‌ వంటి ప్రాంతాల్లోకి ఉక్రెయిన్‌ సైనికులు వెళ్లినప్పుడు క్షేత్రస్థాయిలో పడి ఉన్న రష్యా సైనికుల మృతదేహాలు కనిపిస్తున్నాయి. వీటిని ఉక్రెయిన్‌ బలగాలు వెంటనే తరలించకుండా అలా వదిలేశాయి. ఉక్రెయిన్‌లోని నాలుగు ప్రాంతాలను స్వాధీనం చేసుకుంటున్నట్లు ప్రకటించిన రష్యాతో చర్చలు జరిపేదే లేదని అధ్యక్షుడు జెలెన్‌స్కీ తేల్చిచెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని