పాక్‌ శునకాలు, గాడిదలపై చైనా ఆసక్తి!

పాకిస్థాన్‌ నుంచి శునకాలు, గాడిదలను దిగుమతి చేసుకునేందుకు చైనా ఆసక్తి చూపుతోంది. దాయాది దేశం అధికారులు తమ దేశ పార్లమెంటరీ కమిటీకి ఈ విషయాన్ని వెల్లడించారు.

Published : 05 Oct 2022 06:13 IST

ఇస్లామాబాద్‌: పాకిస్థాన్‌ నుంచి శునకాలు, గాడిదలను దిగుమతి చేసుకునేందుకు చైనా ఆసక్తి చూపుతోంది. దాయాది దేశం అధికారులు తమ దేశ పార్లమెంటరీ కమిటీకి ఈ విషయాన్ని వెల్లడించారు. ఎగుమతులు, దిగుమతులకు సంబంధించి సోమవారం వాణిజ్య మంత్రిత్వశాఖ అధికారులు, సెనెట్‌ స్థాయీ సంఘం మధ్య సమావేశం సందర్భంగా ఈ అంశం ప్రస్తావనకు వచ్చినట్లు జియో న్యూస్‌ పేర్కొంది. సెనెటర్‌ అబ్దుల్‌ కదీర్‌ మాట్లాడుతూ.. పాకిస్థాన్‌ నుంచి గాడిదలు, శునకాలు దిగుమతి చేసుకునే విషయమై చైనా రాయబారి ఆసక్తి చూపినట్లు వెల్లడించారు. అఫ్గానిస్థాన్‌లో జంతువులు చౌకగా లభిస్తున్నందున, పాకిస్థాన్‌ వాటిని దిగుమతి చేసుకుని మాంసాన్ని చైనాకు ఎగుమతి చేయాలని కమిటీ సభ్యుడు ఒకరు సూచించారు. లంపీ చర్మవ్యాధి నేపథ్యంలో అఫ్గానిస్థాన్‌ నుంచి జంతువుల దిగుమతిని నిలిపివేసినట్లు అధికారులు కమిటీకి తెలిపారు. చైనాలో తయారయ్యే ‘ఎజావో’ అనే ఔషధం తయారీకి గాడిద చర్మాన్ని ఉపయోగిస్తారు. అందువల్లే గాడిదల దిగుమతికి చైనా ఆసక్తి చూపిస్తున్నట్లు భావిస్తున్నారు. ‘ఎజావో’ ఔషధం రక్తాన్ని శుద్ధి చేయడంతోపాటు, రోగనిరోధక శక్తిని పెంపొందిస్తుంది. ప్రస్తుతం పాకిస్థాన్‌లో 5.7 మిలియన్ల గాడిదలు ఉన్నట్లు అంచనా. గార్దభాల సంఖ్యలో పాక్‌ది ప్రపంచంలోనే మూడో స్థానం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు