రూ.3,860 కోట్ల పరిహారం చెల్లించాల్సిందే!

అంతర్జాతీయ వార్తా సంస్థ సీఎన్‌ఎన్‌ నెట్‌వర్క్‌పై అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ పరువు నష్టం కేసు దాఖలు చేశారు. తన పరువుకు ఆ సంస్థ భంగం కలిగించిందని, అందుకు సుమారు రూ.3,860 కోట్లు (475 మిలియన్‌ డాలర్లు) పరిహారం కోరారు.

Published : 05 Oct 2022 06:13 IST

సీఎన్‌ఎన్‌పై ట్రంప్‌ పరువునష్టం దావా

న్యూయార్క్‌: అంతర్జాతీయ వార్తా సంస్థ సీఎన్‌ఎన్‌ నెట్‌వర్క్‌పై అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ పరువు నష్టం కేసు దాఖలు చేశారు. తన పరువుకు ఆ సంస్థ భంగం కలిగించిందని, అందుకు సుమారు రూ.3,860 కోట్లు (475 మిలియన్‌ డాలర్లు) పరిహారం కోరారు. ఈ మేరకు 29 పేజీలతో కూడిన దావాను ట్రంప్‌ తరఫు న్యాయవాదులు ఫ్లోరిడాలోని యూఎస్‌ డిస్ట్రిక్ట్‌ కోర్టులో సోమవారం సమర్పించారు. 2020 అధ్యక్ష ఎన్నికల్లో జో బైడెన్‌తో పోటీ సందర్భంగా జరిగిన భారీ మోసంతో తాను నష్టపోయానంటూ ట్రంప్‌ చేసిన ఆరోపణను ‘పెద్ద అబద్ధం’ అంటూ సీఎన్‌ఎన్‌ పేర్కొనడాన్ని పిటిషన్‌లో ప్రధానంగా తప్పుపట్టారు. తనను ఒక పెద్ద మోసకారిగా సీఎన్‌ఎన్‌ చిత్రీకరిస్తోందని ట్రంప్‌ ఆరోపించారు. 2021 జనవరి నుంచి 7,700సార్లు తనను అబద్ధపు మోసకారిగా ఆ మీడియా సంస్థ అభివర్ణించిందని వ్యాజ్యంలో పేర్కొన్నారు. 2024 అధ్యక్ష ఎన్నికల్లో తాను మళ్లీ పోటీ చేస్తానని భయపడి.. ఇటీవల తనపై సీఎన్‌ఎన్‌ దాడిని పెంచిందని ఆరోపించారు. ఈ కేసుపై సీఎన్‌ఎన్‌ ఇప్పటి వరకూ స్పందించలేదు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని