Alzheimer: అల్జీమర్స్‌ను ఆదిలోనే పట్టేయొచ్చు!

తీవ్ర మతిమరుపునకు దారితీసే అల్జీమర్స్‌ వ్యాధిని ప్రారంభ దశల్లోనే గుర్తించగల సరికొత్త సాంకేతికతను అమెరికాలోని పిట్స్‌బర్గ్‌ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు తాజాగా అభివృద్ధి చేశారు.

Updated : 21 Oct 2022 08:15 IST

సరికొత్త సాంకేతికతను అభివృద్ధి చేసిన శాస్త్రవేత్తలు

వాషింగ్టన్‌: తీవ్ర మతిమరుపునకు దారితీసే అల్జీమర్స్‌ వ్యాధిని ప్రారంభ దశల్లోనే గుర్తించగల సరికొత్త సాంకేతికతను అమెరికాలోని పిట్స్‌బర్గ్‌ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు తాజాగా అభివృద్ధి చేశారు. ‘పాజిట్రాన్‌ ఎమిషన్‌ టోమోగ్రఫీ (పీఈటీ)’ ఇమేజింగ్‌ టెక్నిక్‌గా దాన్ని పిలుస్తున్నారు. అల్జీమర్స్‌ తొలి దశల్లో ఉన్న వ్యక్తుల్లో.. మోనోఅమైన్‌ ఆక్సిడేజ్‌-బి (ఎంఏవో-బీ) ఎంజైమ్‌ను గుర్తించడం ద్వారా ఇది వ్యాధి నిర్ధారణ జరుపుతుంది. ఇందుకోసం 18ఎఫ్‌-ఎస్‌ఎంబీటీ-1 అనే రేడియోట్రేసర్‌ ఏజెంట్‌ను వినియోగించుకుంటుంది. తొలినాళ్లలోనే వ్యాధిని గుర్తించడం వల్ల వ్యక్తులు మెరుగైన చికిత్స తీసుకునేందుకు వీలు కలుగుతుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని