Europe: ధరలు పెరిగి ఐరోపా హాహాకారాలు: సమ్మెబాటలో కార్మికులు, ఉద్యోగులు
ఉక్రెయిన్ యుద్ధం తెచ్చిపెట్టిన ఆహార, ఇంధన కొరత సమస్యలు ఐరోపా దేశాలను వేధిస్తున్నాయి. ద్రవ్యోల్బణం పెరిగిపోయి ప్రజల నిత్యజీవితాలు ఇక్కట్లమయం అవుతున్నాయి.
లండన్: ఉక్రెయిన్ యుద్ధం తెచ్చిపెట్టిన ఆహార, ఇంధన కొరత సమస్యలు ఐరోపా దేశాలను వేధిస్తున్నాయి. ద్రవ్యోల్బణం పెరిగిపోయి ప్రజల నిత్యజీవితాలు ఇక్కట్లమయం అవుతున్నాయి. 19 యూరోజోన్ దేశాల్లో ద్రవ్యోల్బణం రికార్డు స్థాయిలో 9.9 శాతానికి చేరింది. ఆదాయాలకన్నా జీవనవ్యయం పెరిగిపోయిందని ఈ దేశాల్లో ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీన్ని తట్టుకోడానికి జీతభత్యాలు పెంచాలని సమ్మెబాట పడుతున్నారు. ఆర్థికసంక్షోభం దెబ్బకు బ్రిటన్ ప్రధానమంత్రి పదవికి లిజ్ ట్రస్ 45 రోజుల్లోనే రాజీనామా చేయాల్సి వచ్చింది. యూరోజోన్ అంతటిలోకి అత్యల్ప ద్రవ్యోల్బణం (6.2 శాతం) నమోదైన ఫ్రాన్స్‌లోనూ రైల్వే, రోడ్డు రవాణాసంస్థల ఉద్యోగులు, ఉన్నత పాఠశాలల ఉపాధ్యాయులు, ప్రభుత్వ ఆస్పత్రుల సిబ్బంది, చమురుశుద్ధి కర్మాగారాల కార్మికులు జీతాల పెంపు కోసం దేశమంతటా సమ్మెకు దిగారు. నాటో నుంచి ఫ్రాన్స్ బయటకు రావాలని కోరేవారి సంఖ్య పెరుగుతోంది. బ్రిటన్ లో ద్రవ్యోల్బణం గత నాలుగు దశాబ్దాల్లో ఎన్నడూ లేనంతగా 10.1 శాతానికి పెరగడంతో రైల్వే, రేవు కార్మికులు, నర్సులు, న్యాయస్థానాల సిబ్బంది గడచిన కొన్ని నెలలుగా సమ్మెలు చేస్తున్నారు. జర్మనీతోపాటు ఇతర ఐరోపా దేశాల్లోనూ ఇదే డిమాండుతో విమానయాన సంస్థల సిబ్బంది సమ్మెకు దిగారు. రొమేనియా, చెక్ రిపబ్లిక్లలో జీవనవ్యయం పెరిగిపోవడంపై ప్రజలు నిరసన ప్రదర్శనలు చేస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
గుండెపోటుతో గ్యాంగ్‌స్టర్ ముఖ్తార్ అన్సారీ మృతి.. యూపీలో 144 సెక్షన్
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
-
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
-
IPL 2024: కోల్‌కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్