Heart Attack: మృత్యుఒడికి దగ్గరైన క్షణాలు వారికి గుర్తుంటాయ్‌!

జీవితంలో చేసిన తప్పొప్పులు, మంచి-చెడు అన్నీ చనిపోయే ముందు ఒక్కసారిగా గుర్తొస్తాయని చాలామంది అంటుంటారు! ఆ మాట వాస్తవమేనని చెబుతున్నారు అమెరికా శాస్త్రవేత్తలు.

Updated : 08 Nov 2022 06:57 IST

వాషింగ్టన్‌: జీవితంలో చేసిన తప్పొప్పులు, మంచి-చెడు అన్నీ చనిపోయే ముందు ఒక్కసారిగా గుర్తొస్తాయని చాలామంది అంటుంటారు! ఆ మాట వాస్తవమేనని చెబుతున్నారు అమెరికా శాస్త్రవేత్తలు. గుండెపోటుతో మరణం అంచుల వరకూ వెళ్లి వచ్చిన ప్రతి ఐదుగురిలో ఒకరు.. దాదాపుగా మృత్యుఒడి చేరినప్పటికి సంబంధించిన పలు విషయాలను తర్వాత తిరిగి గుర్తుకు చేసుకోగలుగుతున్నట్లు తేల్చారు. అమెరికా, బ్రిటన్‌లలో 2017 మే నుంచి 2020 మార్చి మధ్య గుండెపోటుకు గురై.. కార్డియోపల్మనరీ రిససిటేషన్‌ (సీపీఆర్‌) చేయడంతో చివరకు ప్రాణాలతో బయటపడ్డ పలువురు వ్యక్తులపై వారు ఓ అధ్యయనాన్ని చేపట్టారు. ‘చివరి క్షణాల్లో’ శరీరం నుంచి వేరవుతున్న భావన తమకు కలిగినట్లు శాస్త్రవేత్తలకు ఎక్కువ మంది తెలిపారు. ఆ సమయంలో ఎలాంటి నొప్పి, బాధ తమకు లేవని.. జీవితంలో చేసిన కొన్ని కీలక పనులు కళ్ల ముందు కదలాడాయని.. కొందరి గురించి ఆలోచనలు వచ్చాయని వెల్లడించారు. సీపీఆర్‌కు ముందు ఆయా వ్యక్తుల మెదళ్లలో వచ్చిన మార్పులను విశ్లేషించిన శాస్త్రవేత్తలు.. మరణం సమీపించినప్పుడు వారికి కలిగిన భావనలేవీ భ్రమలు కాదని తేల్చారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని