ఆ గ్రామం ధర రూ.2 కోట్లు

ఇల్లుకొనే డబ్బుతో ఏకంగా ఓ గ్రామాన్నే కొనొచ్చంటే.. ఆశ్చర్యమే కదా..! అలాంటి అవకాశం స్పెయిన్‌లో అందుబాటులోకి వచ్చింది.

Published : 14 Nov 2022 04:21 IST

మాద్రీద్‌: ఇల్లుకొనే డబ్బుతో ఏకంగా ఓ గ్రామాన్నే కొనొచ్చంటే.. ఆశ్చర్యమే కదా..! అలాంటి అవకాశం స్పెయిన్‌లో అందుబాటులోకి వచ్చింది. ఇక్కడ ఓ గ్రామాన్ని ప్రస్తుతం అమ్మకానికి పెట్టారు. దీని ధర కేవలం 2,27,000 యూరోలు(సుమారు రూ.2 కోట్ల 16లక్షలు) మాత్రమే కావడం విశేషం.

స్పెయిన్‌లోని సాల్టో డే కాస్ట్రో అనే గ్రామం పోర్చుగల్‌ సరిహద్దులో ఉంది. రాజధాని మాద్రీద్‌ నుంచి మూడు గంటల్లో అక్కడికి చేరుకోవచ్చు. 1950ల్లో ఆ ప్రాంతంలో ఓ రిజర్వాయర్‌ నిర్మాణాన్ని చేపట్టారు. ఆ సమయంలో కార్మికుల కోసం విద్యుత్‌ ఉత్పత్తి సంస్థ నివాసాలు ఏర్పాటు చేసింది. ఆ ప్రాజెక్టు పూర్తైన తర్వాత అక్కడివారంతా సమీప పట్టణాలకు తరలిపోవడంతో 1990 చివరి నాటికి ఆ ఊరు మొత్తం ఖాళీ అయ్యింది. అక్కడ 44 ఇళ్లు, ఓ హోటల్‌, చర్చి, పాఠశాల, స్విమ్మింగ్‌ పూల్‌తోపాటు ఇతర సదుపాయాలున్నాయి. స్పెయిన్‌కు చెందిన ప్రాపర్టీ వెబ్‌సైట్‌లో ఈ గ్రామం విక్రయానికి సంబంధించి ప్రకటన ఉంచారు. దీంతో రష్యా, ఫ్రాన్స్‌, బెల్జియంతోపాటు బ్రిటన్‌కు చెందిన 300 మంది ఆ గ్రామాన్ని కొనేందుకు ముందుకు వచ్చినట్లు  సమాచారం.

Read latest World News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు