Tiffany trump: బాయ్‌ఫ్రెండ్‌ను పెళ్లాడిన ట్రంప్‌ కూతురు

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కుమార్తె టిఫానీ ట్రంప్‌ పెళ్లిపీటలెక్కారు. తన బాయ్‌ఫ్రెండ్‌ మైఖెల్‌ బౌలస్‌ను వివాహం చేసుకున్నారు.

Published : 14 Nov 2022 08:13 IST

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కుమార్తె టిఫానీ ట్రంప్‌ పెళ్లిపీటలెక్కారు. తన బాయ్‌ఫ్రెండ్‌ మైఖెల్‌ బౌలస్‌ను వివాహం చేసుకున్నారు. ట్రంప్‌నకు చెందిన మార్‌ ఎ లాగో రిసార్ట్‌లో ఈ వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. ట్రంప్‌ దగ్గరుండి పెళ్లి వేడుకను జరిపించారు. వధువు టిఫానీని వెంటబెట్టుకొని వివాహ వేదిక వద్దకు తీసుకొచ్చారు. అనంతరం టిఫానీకి ఆప్యాయంగా ముద్దు పెట్టి వరుడి చెయ్యికి వధువు చెయ్యిని అందించారు. అమెరికా కాలమానం ప్రకారం శనివారం సాయంత్రం 4.30 గంటలకు వివాహం జరిగింది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని