అమెరికా వెళ్లినా కంప్యూటర్ సైన్సే
అమెరికాలో చదువుకునేందుకు వెళుతున్న విదేశీ విద్యార్థుల్లో అయిదోవంతుకు పైగా కంప్యూటర్ సైన్స్ కోర్సులోనే చేరుతున్నారు.
విదేశీ విద్యార్థుల్లో 21 శాతం మంది ఎంపిక అదే
భారతీయుల్లో 36.8 శాతం సీఎస్‌లోనే చేరిక
ఈనాడు, హైదరాబాద్: అమెరికాలో చదువుకునేందుకు వెళుతున్న విదేశీ విద్యార్థుల్లో అయిదోవంతుకు పైగా కంప్యూటర్ సైన్స్ కోర్సులోనే చేరుతున్నారు. ఆ సంఖ్య ఏటేటా పెరుగుతుండగా...మిగిలిన కోర్సుల్లో చేరే వారి సంఖ్య తగ్గిపోతోంది. అమెరికాలో విద్యకు వెళ్లే భారతీయ విద్యార్థుల్లో 36.8 శాతం మంది కంప్యూటర్ సైన్సే చదువుతున్నారు. తాజాగా అమెరికా ప్రభుత్వ సహకారంతో ఇంటర్నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ (ఐఐఈ) విడుదల చేసిన ఓపెన్ డోర్స్-2022 నివేదిక ద్వారా ఆ విషయం స్పష్టమవుతోంది. దాని ప్రకారం 2021-22లో అమెరికాలో అనేక దేశాలకు చెందిన 9.48 లక్షల మంది చదువుతున్నారు. వారిలో కంప్యూటర్ సైన్స్ (సీఎస్)లో చేరేవారే 2 లక్షల మంది (21.10 శాతం). వారిలో చైనా నుంచి 67 వేల మంది, భారత్ నుంచి 73 వేల మంది ఉండటం గమనార్హం. అమెరికాలో ఐటీ, సాఫ్ట్‌వేర్ రంగంలో వేతనాలు అధికంగా ఉండటంతో భారత్‌తోపాటు ఇతర ఆసియా దేశాల వారు కంప్యూటర్ సైన్స్‌పై ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారని ఐఎంఎఫ్‌ఎస్ కన్సల్టెన్సీ డైరెక్టర్ వేములపాటి అజయ్‌కుమార్ చెప్పారు. మున్ముందు ఆ కోర్సులో చేరే వారి సంఖ్య ఇంకా పెరుగుతుందని ఆయన తెలిపారు. ఏటా కంప్యూటర్ సైన్స్‌లో చేరే వారు పెరుగుతుండటంతో ఇంజినీరింగ్, బిజినెస్ అండ్ మేనేజ్‌మెంట్, ఇతర కోర్సుల్లో ప్రవేశాలు తగ్గుతున్నాయి. (అమెరికాలో కంప్యూటర్ సైన్స్‌ను ఇంజినీరింగ్‌గా కాకుండా విడిగా పరిగణిస్తున్నారు). 2020-21 వరకు అమెరికాలో చేరే విదేశీ విద్యార్థుల్లో మొదటి స్థానం ఇంజినీరింగ్‌దే. తొలిసారిగా 2021-22లో ఆ స్థానాన్ని కంప్యూటర్ సైన్స్ ఆక్రమించింది. బిజినెస్ అండ్ మేనేజ్‌మెంట్‌లో చేరి వారి సంఖ్య కూడా గణనీయంగా తగ్గుతున్నట్లు గణాంకాల ద్వారా వెల్లడవుతోంది.
మూడో వంతుకుపైగా భారతీయ విద్యార్థులు...
భారతీయ విద్యార్థుల్లో అత్యధిక శాతం కంప్యూటర్ సైన్స్‌లోనే చేరుతున్నారు. అమెరికాలో 1,99,182 మంది విద్యార్థులు ఉండగా వారిలో 36.8 శాతం...అంటే మూడో వంతుకు మించి గణితం, కంప్యూటర్ సైన్సే చదువుతున్నారు. ఆ తర్వాత ఇంజినీరింగ్‌లో 29.60 శాతం, బిజినెస్-మేనేజ్‌మెంట్‌లో 13.30 శాతం, వైద్య విద్యలో 2.6 శాతం, ఫిజికల్/లైఫ్ సైన్సెస్‌లో 6.5 శాతం మంది ఉన్నారు. ఏటా ఇంజినీరింగ్‌లో చేరే వారి శాతం తగ్గుతుండగా...సీఎస్‌లో పెరుగుతోంది.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (30/01/2023)
-
World News
ఐదు నెలలుగా విమానాశ్రయంలోనే.. రష్యన్ పౌరుల ‘ది టెర్మినల్’ స్టోరీ!
-
India News
Vande Bharat Express: వందే భారత్ రైళ్లలో క్లీనింగ్ ప్రక్రియ మార్పు.. ఇకపై అలా చేయొద్దు ప్లీజ్!
-
Sports News
Virat - Rohit: విరాట్, రోహిత్.. టీ20ల్లో వీరిద్దరిలో ఒక్కరినైనా ఆడించాలి: పాక్ దిగ్గజం
-
Movies News
Pooja Hegde: సోదరుడి వివాహం.. పూజా హెగ్డే భావోద్వేగం!
-
General News
Sajjanar: అలాంటి సంస్థలకు ప్రచారం చేయొద్దు: సెలబ్రిటీలకు సజ్జనార్ సలహా