అమ్మమ్మ మృతదేహం చెంత సజీవంగా మనవడు

ఇండోనేసియాలోని జావా ద్వీపంలో రెండ్రోజుల క్రితం సంభవించిన భూకంపంలో ప్రాణాలు కోల్పోయినవారి సంఖ్య 271కి పెరిగింది. శిథిలాల్లో అమ్మమ్మ మృతదేహం పక్కన సజీవంగా ఉన్న ఆరేళ్ల బాలుడిని సహాయక బృందాలు గుర్తించి సురక్షితంగా బయటకు తీసుకువచ్చాయి.

Updated : 24 Nov 2022 05:23 IST

రెండ్రోజుల తర్వాత ఆచూకీ లభ్యం
ఇండోనేసియాలో కొనసాగుతున్న గాలింపు

చియాంజుర్‌: ఇండోనేసియాలోని జావా ద్వీపంలో రెండ్రోజుల క్రితం సంభవించిన భూకంపంలో ప్రాణాలు కోల్పోయినవారి సంఖ్య 271కి పెరిగింది. శిథిలాల్లో అమ్మమ్మ మృతదేహం పక్కన సజీవంగా ఉన్న ఆరేళ్ల బాలుడిని సహాయక బృందాలు గుర్తించి సురక్షితంగా బయటకు తీసుకువచ్చాయి. ఇలాంటివారి కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. ఇప్పటికీ కొన్ని ప్రాంతాలకు సహాయక బృందాలు చేరుకోలేకపోతున్నాయి. దాదాపు 12,000 మంది సైనికులను రంగంలోకి దించారు. నిరాశ్రయుల కోసం తాత్కాలిక గుడారాలు ఏర్పాటుచేసి ఆహారం, మందులు, రగ్గులు అందజేస్తున్నారు. కొండ చరియలను తొలగించడం సవాల్‌గా మారింది. దీనికితోడు బుధవారం మధ్యాహ్నం భారీ వర్షాలు కురియడంతో సహాయక చర్యలకు ఆటంకాలు ఎదురయ్యాయి. ప్రభుత్వ స్పందన తగిన రీతిలో లేదని స్థానికులు పెదవి విరుస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని