అమెరికాలో నేరగాళ్లను చంపే రోబోలు

అమెరికాలో ఇటీవల ఎక్కడ చూసినా విచ్చలవిడిగా కాల్పుల ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ఈ దారుణాలను అరికట్టేందుకు శాన్‌ఫ్రాన్సిస్కో పోలీసులు సరికొత్త ప్రతిపాదన తీసుకొచ్చారు.

Updated : 26 Nov 2022 05:03 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: అమెరికాలో ఇటీవల ఎక్కడ చూసినా విచ్చలవిడిగా కాల్పుల ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ఈ దారుణాలను అరికట్టేందుకు శాన్‌ఫ్రాన్సిస్కో పోలీసులు సరికొత్త ప్రతిపాదన తీసుకొచ్చారు. కాల్పుల వంటి తీవ్రమైన ఘటనలకు ప్రయత్నించే నేరగాళ్లను అంతమొందించేందుకు రోబో పోలీసులను ఉపయోగించాలని యోచిస్తున్నారు. ఈ మేరకు ముసాయిదా ప్రణాళికను రూపొందించారు.  శాన్‌ఫ్రాన్సిస్కో పోలీసు విభాగంలో ప్రస్తుతం 17 రోబోలు ఉన్నాయి. ఇందులో 12 నిర్వహణలో లేవు. మిగతా వాటిని బాంబు తనిఖీలు, నిర్వీర్యానికి ఉపయోగిస్తున్నారు. తీవ్రమైన నేర ఘటనల్లోనూ వీటిని వినియోగించాలని అక్కడి పోలీసులు భావిస్తున్నారు. ఇందులో భాగంగానే కాల్పుల వంటి ఘటనలను తిప్పికొట్టే క్రమంలో నేరగాళ్లను చంపేసేలా రోబోల సామర్థ్యాన్ని పెంచాలని యోచిస్తున్నారు. మెషిన్‌గన్లు, గ్రనేడ్‌ లాంఛర్లతో వాటిని తీర్చిదిద్దాలని ముసాయిదాలో పేర్కొన్నారు. దీనిపై వచ్చేవారం జరిగే ఉన్నత స్థాయి సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు