సంక్షిప్త వార్తలు(2)

నేపాల్‌ పార్లమెంటు ఎన్నికల్లో ప్రధానమంత్రి షేర్‌ బహుదూర్‌ దేవ్‌బా నేతృత్వంలోని నేపాలీ కాంగ్రెస్‌(ఎన్‌సీ) కూటమి అధికారం దిశగా కొనసాగుతోంది.

Updated : 28 Nov 2022 05:35 IST

నేపాల్‌లో అధికారం దిశగా ఎన్‌సీ కూటమి

కాఠ్‌మాండూ: నేపాల్‌ పార్లమెంటు ఎన్నికల్లో ప్రధానమంత్రి షేర్‌ బహుదూర్‌ దేవ్‌బా నేతృత్వంలోని నేపాలీ కాంగ్రెస్‌(ఎన్‌సీ) కూటమి అధికారం దిశగా కొనసాగుతోంది. ఆదివారం జరిగిన కౌంటింగ్‌లో ఎన్‌సీ మరో రెండు సీట్లు నెగ్గి తన స్థానాలను 53కు పెంచుకుంది. ఇప్పటివరకు ప్రకటించిన 157 సీట్లలో 85 చోట్ల ఎన్‌సీ కూటమి పక్షాలు విజయం సాధించాయి. 275 సభ్యుల ప్రతినిధుల సభలో 165 మందిని ప్రత్యక్షంగా ఎన్నుకుంటారు. మిగిలిన 110 మంది దామాషా పద్ధతిలో ఎంపికవుతారు. ప్రభుత్వం ఏర్పరచాలంటే 138 సీట్లు సాధించాలి. మాజీ ప్రధాని కేపీ శర్మ ఓలి (సీపీఎన్‌-యూఎంఎల్‌) నేతృత్వంలోని ప్రతిపక్ష కూటమికి 55 సీట్లు లభించాయి.నన్ను హతమార్చేందుకు ముగ్గురు షూటర్ల యత్నం
పాక్‌ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌

ఇస్లామాబాద్‌: తనను హత్య చేసేందుకు ముగ్గురు షూటర్లు ప్రయత్నించారని పాకిస్థాన్‌ మాజీ ప్రధాని, తెహ్రీక్‌-ఎ-ఇన్సాఫ్‌ (పీటీఐ) అధ్యక్షుడు ఇమ్రాన్‌ఖాన్‌ ఆరోపించారు. పంజాబ్‌లోని వజీరాబాద్‌లో నవంబరు 3న జరిగిన నిరసన ప్రదర్శనలో ఇమ్రాన్‌ఖాన్‌పై ఓ వ్యక్తి కాల్పులు జరపగా, ఆయన కుడి కాలులోకి బుల్లెట్‌ దూసుకుపోయిన సంగతి తెలిసిందే. అయితే తనపై హత్యాయత్నంలో ముగ్గురు షూటర్లు పాలుపంచుకున్నారని శనివారం రావల్పిండిలో జరిగిన భారీ ర్యాలీలో ఇమ్రాన్‌ పేర్కొన్నారు. మొదటి షూటర్‌ తనతోపాటు పీటీఐ నాయకులను లక్ష్యంగా చేసుకొని కాల్పులు జరపగా రెండో గన్‌మన్‌ కంటెయినర్‌పై కాల్పులు జరిపారని తెలిపారు. అయితే మొదటి షూటర్‌ను హతమార్చే పని మూడో వ్యక్తికి అప్పగించగా అతను అందుకు బదులు ప్రదర్శనలో ఉన్న ఒకరిని హతమార్చాడని వివరించారు.


 

Read latest World News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని