ఉగ్రవాదులు నక్కిన హోటల్‌పై దాడులు

సోమాలియా రాజధాని మొగదిషులో ఇస్లామిక్‌ తీవ్రవాదులు నక్కిన విల్లా రోసా హోటల్‌పై పోలీసులు దాడి చేశారు.

Published : 29 Nov 2022 04:51 IST

ఆరుగురు ముష్కరుల హతం

మొగదిషు: సోమాలియా రాజధాని మొగదిషులో ఇస్లామిక్‌ తీవ్రవాదులు నక్కిన విల్లా రోసా హోటల్‌పై పోలీసులు దాడి చేశారు. కాల్పుల ధాటికి ఆరుగురు ఉగ్రవాదులు, ఓ పోలీసు సిబ్బంది మరణించినట్టు అధికారులు సోమవారం వెల్లడించారు. సోమాలియా ప్రభుత్వాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న అల్‌-షబాబ్‌ ఉగ్రవాద సంస్థ... పలుచోట్ల దాడులు చేపట్టి, ఎనిమిది మంది అమాయకులను హతమార్చింది. ఈ దాడుల అనంతరం ఉగ్రవాదులు విల్లా రోసా హోటల్‌లోకి చొరబడ్డారు. అక్కడున్న 60 మంది సామాన్యులను బంధించారు. 18 గంటల హైడ్రామా అనంతరం పోలీసులు ఆ హోటల్‌పై చాకచక్యంగా దాడి చేశారు. ఉగ్రవాదులను హతమార్చి, అక్కడ చిక్కుకున్న 60 మందిని సురక్షితంగా విడిపించారు. సోమాలియా సర్కారును పడగొట్టి, షరియా చట్టాన్ని అమలు చేసేందుకు అల్‌-షబాబ్‌ ప్రయత్నిస్తోంది. ఇది కరడుగట్టిన ఉగ్రవాద సంస్థ అని అమెరికా గతంలోనే ప్రకటించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని