హృద్రోగం కట్టడికి సరికొత్త ఔషధం

హృద్రోగ చికిత్సకు జరుగుతున్న పరిశోధనల్లో మరో మైలురాయి! రక్తనాళాలు పూడుకుపోయే పరిస్థితిని అడ్డుకొనే కొత్త ఔషధ తయారీకి బాటలు పడ్డాయి.

Published : 30 Nov 2022 03:54 IST

వాషింగ్టన్‌: హృద్రోగ చికిత్సకు జరుగుతున్న పరిశోధనల్లో మరో మైలురాయి! రక్తనాళాలు పూడుకుపోయే పరిస్థితిని అడ్డుకొనే కొత్త ఔషధ తయారీకి బాటలు పడ్డాయి. గుండెకు రక్తాన్ని తీసుకెళ్లే నాళాల్లో కొలెస్ట్రాల్‌, కొవ్వు పదార్థాలు చేరడం ఆరంభమైతే... ఆ రక్తనాళాలు మృదువుగా, ఆరోగ్యంగా ఉండేందుకు దోహదపడే కండర కణాల పరిమాణం, సంఖ్య పెరిగిపోతుంది. ఫలితంగా రక్తనాళాలు పూడుకుపోయి.. బాధితులకు స్టంట్లు వేయడం, బైపాస్‌ సర్జరీ చేయడం అనివార్యమవుతుంది. ఈ సమస్యపై జార్జియా మెడికల్‌ కళాశాల శాస్త్రవేత్తలు పరిశోధన సాగించారు. ‘‘రక్తనాళాల్లో ఉండే ‘ఎండోథెలియాల్‌’ కణాలు.. ఆ నాళాల మృదు కండరాలకు నిత్యం సంకేతాలు పంపుతాయి. నాళాల్లో కొవ్వు చేరికతో ఆ సంకేతాలు దెబ్బతిని, మృదు కండర కణజాలం పెరుగుతోంది. ‘ఏటీఐసీ జన్యువు’ను లక్ష్యంగా చేసుకుని ఔషధాన్ని రూపొందిస్తే.. మృదు కండర కణజాలం పెరుగుదలకు కారణమవుతున్న ప్యూరిన్‌’ను అడ్డుకోవచ్చు. తద్వారా హృద్రోగ సమస్యను నివారించవచ్చు’’ అని పరిశోధకులు వివరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని