ఇజ్రాయెల్, పాలస్తీనా మధ్య ముదిరిన సమరం
వెస్ట్ బ్యాంక్‌లో ఫుట్‌పాత్‌పై నడుచుకుంటూ వెళ్తున్న ఒక ఇజ్రాయెలీ మహిళా సైనికురాలిని మంగళవారం కారుతో ఢీకొట్టి తీవ్రంగా గాయపరచిన పాలస్తీనా వ్యక్తిని ఇజ్రాయెల్ పోలీసులు కాల్చిచంపారు.
జెరూసలెం: వెస్ట్ బ్యాంక్‌లో ఫుట్‌పాత్‌పై నడుచుకుంటూ వెళ్తున్న ఒక ఇజ్రాయెలీ మహిళా సైనికురాలిని మంగళవారం కారుతో ఢీకొట్టి తీవ్రంగా గాయపరచిన పాలస్తీనా వ్యక్తిని ఇజ్రాయెల్ పోలీసులు కాల్చిచంపారు. రనీ అబూ అలీ (45) అనే ఆ పాలస్తీనావాసి రోజంతా జరిగిన హింసాయుత ఘటనల్లో హతమైన నాలుగో వ్యక్తి. గతవారం జెరూసలెంలో జరిగిన బాంబు పేలుడులో ఇద్దరు ఇజ్రాయెలీలు మరణించినప్పటి నుంచి వెస్ట్ బ్యాంక్‌లో హింస కొనసాగుతోంది. హెబ్రాన్ నగరంలో పౌరులకు, ఇజ్రాయెల్ సైనికులకు మధ్య సోమవారం రాత్రి ఘర్షణలు మొదలయ్యాయి. సైనికుల కాల్పుల్లో ముఫిద్ ఖలీల్ (44) అనే వ్యక్తి మరణించగా.. మరో 8 మంది గాయపడ్డారు. ఈ ఏడాది మొదటి నుంచి వెస్ట్ బ్యాంక్, తూర్పు జెరూసలెంలలో పాలస్తీనా, ఇజ్రాయెల్ సైనికులకూ మధ్య జరుగుతున్న ఘర్షణలలో 140 మందికిపైగా పాలస్తీనా వాసులు మరణించారు. 1967 అరబ్-ఇజ్రాయెల్ యుద్ధంలో తూర్పు జెరూసలెం, గాజా ప్రాంతాలను ఇజ్రాయెల్ సైన్యం స్వాధీనం చేసుకుంది. స్వతంత్ర పాలస్తీనాలో ఆ రెండు ప్రాంతాలూ అంతర్భాగాలు కావాలనే డిమాండ్ తో పాలస్తీనా తిరుగుబాటు చేస్తోంది.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
World News
USA: భారత వ్యతిరేకి ఇల్హాన్ ఒమర్‌కు షాక్..!
-
India News
Layoffs: దిగ్గజ కంపెనీలు తొలగిస్తుంటే.. కార్లను బహుమతిగా ఇచ్చిన ఐటీ కంపెనీ..!
-
Latestnews News
MCC: పరిహాసానికి కూడా అలాంటి వ్యాఖ్యలు చేయొద్దు: ఆండ్రూ స్ట్రాస్
-
Crime News
Crime news: అనుమానంతో భార్యను చంపి.. సమాధిపై మొక్కల పెంపకం!
-
Movies News
Shah Rukh Khan: షారుక్‌ను ఎవరితోనూ పోల్చొద్దు.. హాలీవుడ్ జర్నలిస్ట్‌పై మండిపడుతున్న ఫ్యాన్స్!
-
World News
Rishi Sunak: సునాక్ మీరు బిలియనీరా..? బ్రిటన్ ప్రధాని సమాధానమిదే..